చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదికి తెస్తాయి. ఈ తరహా ఘటనే ఎయిర్ పోర్టులో జరిగింది.
న్యూఢిల్లీ: వీల్ చైర్ లేని కారణంగా ఓ ప్రయాణీకుడు మృతి చెందాడు. న్యూయార్క్ నుండి ముంబై విమానంలో బయలుదేరాల్సిన ప్రయాణీకుడు గుండెపోటుతో మరణించాడు.ఈ ఘటన ఈ నెల 12న ముంబై ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది.
మీడియా నివేదికల ప్రకారంగా వీల్ చైర్లను దంపతులు ముందే బుక్ చేసుకున్నారు. అయితే ఒక్కటే వీల్ చైర్ వచ్చింది. అయితే వీల్ చైర్ లో భార్యను కూర్చోబెట్టి ఆమెతో నడుచుకుంటూ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్లాడు. గుండెపోటుతో కౌంటర్ వద్దే ఆయన కుప్పకూలిపోయాడు.సుమారు కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్లినట్టుగా సమాచారం. దీంతో ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టుగా వైద్యులు అనుమానిస్తున్నారు.
undefined
దురదృష్టవశాత్తు ఈ నెల 12న న్యూయార్క్ నుండి ముంబైకి ప్రయాణీస్తున్న సందర్శకులలో ఒకరు వీల్ చైర్ లో ఉన్న భార్యతో కలిసి ఇమ్మిగ్రేషన్ కు వెళ్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు.అయితే వీల్ చైర్లకు ఆ సమయంలో ఎక్కువగా డిమాండ్ ఉంది. అయితే వీల్ చైర్ అందించే వరకు వేచి చూడాలని కస్టమర్ ను కోరినట్టుగా విమానాశ్రయ వర్గాలు చెప్పాయి.
అయితే వీల్ చైర్ వచ్చే వరకు అతను ఎదురు చూడకుండా తన భార్య వీల్ చైర్ లో కూర్చొబెట్టి ఆమెతో కలిసి నడుచుకుంటూ వెళ్లి అస్వస్థతకు గురైనట్టుగా విమానాశ్రయ వర్గాలు వివరించాయి.ఎయిర్ పోర్టులో వైద్యులు అతడికి ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం అతడిని ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే అప్పటికే అతను మరణించినట్టుగా ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
మృతుడు భారతీయ సంతతికి చెందిన యూఎస్ పాస్ పోర్ట్ హెల్డర్ గా గుర్తించారు. న్యూయార్క్ నుండి ముంబైకి ఎయిరిండియా విమానం AI-116లో ఎకానమీ క్లాస్ లో ప్రయాణీస్తున్నాడు.
ఈ విమానం ముంబైలో ఉదయం పదకొండున్నర గంటలకు ల్యాండ్ కావాల్సి ఉండగా ఆలస్యంగా మధ్యాహ్నం రెండు గంటల 10 నిమిషాలకు ల్యాండ్ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో కోల్‌కత్తాలోని విమానాశ్రయ సిబ్బంది వీల్ చైర్ లో ఉన్న మహిళను లేచి నిలబడాలని కోరారు. సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.