Wheat export: గోధుమ ఎగుమ‌తి నిషేధంపై జీ-7 దేశాల అసంతృప్తి.. కేంద్రం ఏం చెప్పిందంటే..?

Published : May 15, 2022, 11:55 AM IST
Wheat export: గోధుమ ఎగుమ‌తి నిషేధంపై జీ-7 దేశాల అసంతృప్తి.. కేంద్రం ఏం చెప్పిందంటే..?

సారాంశం

Wheat export ban:  గోధుమ‌ల ఎగుమ‌తుల‌పై భార‌త్ నిషేధం విధించ‌డంపై జీ-7 దేశాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. అయితే, గోధుమ‌ల ఎగుమ‌తుల‌పై ఆధార‌ప‌డిన దేశాల అవ‌స‌రాల‌ను తీర్చేందుకు భార‌త్ క‌ట్టుబ‌డి ఉంద‌ని కేంద్ర మంత్రి హ‌ర్దీప్ పూరి అన్నారు.   

Union Minister Hardeep Puri: భార‌త్ గోధుమ‌ల ఎగుమ‌తులపై నిషేధం విధించింది. అయితే, ఈ నిర్ణ‌యంపై దేశంలోని ప్ర‌తిప‌క్షాల‌తో పాటు జీ- దేశాలు సైతం ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతున్నాయి. జీ-7 దేశాలు భార‌త్ నిర్ణ‌యంపై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే భార‌త్ స్పందిస్తూ.. ఆహార గోలుసు హాని కలిగించే దేశాలకు భారతదేశం తన నిబద్ధత మొత్తాన్ని నెరవేరుస్తుందని మరియు ఆహార సరఫరా కోసం భారత్ పై ఆధారపడే పొరుగువారిని విడిచిపెట్టదని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి..  దేశంలోని గోధుమ నిల్వలు సౌకర్యవంతమైన స్థాయిలో ఉన్నాయని మరియు ముందస్తు ఎగుమతి డిమాండ్‌లతో పాటు దేశీయ అవసరాలను తీర్చడానికి ఉపయోగించబడుతుంద‌ని తెలిపారు. 

“గోధుమ నిల్వలు స‌రిప‌డా ఉంటాయి. గోధుమల ఎగుమతులను పరిమితం చేయాలనే నిర్ణయం భారతదేశ ఆహార భద్రతపై దృష్టి సారించి, సరసమైన ఆహార ధాన్యాలు & మార్కెట్ స్పెక్యులేషన్‌ను ఎదుర్కోవడాన్ని నిర్ధారిస్తుంది. భారత్‌ నమ్మకమైన సరఫరాదారు.. ఇరుగుపొరుగు మరియు ఆహార గోల‌సుకు హాని కలిగించే దేశాల అవసరాలతో సహా అన్ని కట్టుబాట్లను నెరవేరుస్తుంది” అని పూరి ట్వీట్ చేశారు. భారతదేశంలో పెరుగుతున్న దేశీయ ధరలు మరియు డిమాండ్‌ను నియంత్రించడానికి గోధుమల ఎగుమతిని నిలిపివేసినట్లు కేంద్రం ప్రకటించిన కొద్ది గంటలకే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ గోధుమల ఎగుమ‌తి నిషేధం గురించి ప్ర‌క‌టించిన వెంట‌నే జర్మనీలో జరిగిన గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) పారిశ్రామిక దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం.. గోధుమ ఎగుమతులను నియంత్రించే భారత్ చ‌ర్య‌లు పెరుగుతున్న వస్తువుల ధరల సంక్షోభాన్ని మరింత దిగజార్చుతుందని పేర్కొంది. 

అయితే, ఎగుమతి హామీలన్నింటినీ నెరవేరుస్తామని భారత్ హామీ ఇచ్చింది. దేశంలో గోధుమల‌ సరఫరా సంక్షోభం లేదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి బివిఆర్ సుబ్రమణ్యం సైతం స్పష్టం. గోధుమ ఎగుమతులపై నిషేధం నిర్ణయం దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలను అరికట్టడంలో.. దేశంలోని పొరుగు, పేద-బలహీన దేశాల ఆహార అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందని తెలిపారు. అంత‌కు ముందు ప్ర‌భుత్వం.. పెరుగుతున్న దేశీయ ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం గోధుమల‌ ఎగుమతులను తక్షణమే నిషేధిస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే, గోధుమల ఎగుమతిపై నిషేధం విధించడంపై కాంగ్రెస్.. కేంద్రంలోని భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడింది. ఇది అధిక ఎగుమతి ధరల ప్రయోజనాలను రైతులకు అందకుండా చేస్తున్నందున ఇది "రైతు వ్యతిరేక చర్య" అని పేర్కొంది.

ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ కొనసాగుతున్న 'చింతన్ శివిర్' రెండవ రోజు విలేకరుల సమావేశంలో ప్రభుత్వం గోధుమ‌ల ఎగుమ‌తిపై తీసుకున్న చ‌ర్య‌ల గురించి మీడియా ప్ర‌శ్నించ‌గా.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరం మాట్లాడుతూ.. "కేంద్ర ప్రభుత్వం గోధుమ‌ల‌ను సేకరించడంలో విఫలమవడమే దీనికి కారణమని నేను భావిస్తున్నాను. గోధుమల ఉత్పత్తి తగ్గిపోయిందని కాదు, ఎక్కువ లేదా తక్కువ అదే. నిజానికి, ఇది స్వల్పంగా ఎక్కువగా ఉండవచ్చు" అని అన్నారు.  ఇలా చేయ‌డంతో తానేమీ ఆశ్చ‌ర్య‌పోలేద‌ని, మోదీ ప్ర‌భుత్వం రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌న్న విష‌యం త‌మ‌కు తెలుస‌ని చిదంబ‌రం ఎద్దేవా చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !