Ukraine Russia Crisis బయటకు రావొద్దు: ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్లకు ఎంబసీ సూచన

Published : Feb 24, 2022, 01:41 PM IST
Ukraine Russia Crisis  బయటకు రావొద్దు: ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్లకు ఎంబసీ సూచన

సారాంశం

ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులంతా తాముంటున్న ప్రాంతాల్లోని బయటకు రావొద్దని భారత ఎంబసీ సూచించింది. ఉక్రెయిన్ పై ఇవాళ రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది.

న్యూఢిల్లీ:  ఇళ్ల నుండి బయటకు రావొద్దని Ukraine లో ఉన్న  Indianలకు భారత ఎంబసీ సూచించింది. ఉక్రెయిన్ పై గురువారం నాడు Russia మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది.  దీంతో ఉక్రెయిన్ లో ఉన్న ఇండియన్ల భద్రతపై ఇండియన్ Embassy కీలక సూచనలు చేసింది.

 పెద్ద ఎత్తున ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇండియన్లు ఎక్కువగా ఉక్రెయిన్  వెళ్తారు. భారతీయ Students తాము ఉంటున్న హాస్టల్స్,  రెస్టారెంట్లు, ఇళ్ల నుండి బయటకు రావొద్దని కోరింది.  భారతీయులెవరూ కూడా కీవ్ పట్టణానికి వెళ్లవద్దని కూడా సూచించింది. కైవ్ లోని పశ్చిమ ప్రాంతాల నుండి ప్రయాణించే వారిని వారి నగరాలకు తిరిగి రావాలని కూడా కోరింది. అంతేకాదు మరిన్ని సలహాలను విడుదల చేస్తామని కూడా ఎంబసీ ప్రకటించింది.

ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితి అత్యంత అనిశ్చితిగా ఉందని ఎంబసీ తెలిపింది. మీరు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా, సురక్షితంగా ఉండాలని కోరింది. ఈ మేరకు కీవ్ లోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా కోరింది.

ఇండియాకు చెందిన సుమారు 20 వేల మంది ఉక్రెయిన్ లో నివాసం ఉంటున్నారు. రష్యా మిలటరీ చర్యను ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ తన గగనతలాన్ని ఇవాళ మూసివేసింది. 

ఉక్రెయిన్ పై రష్యా దాడిని అన్యాయమైన దాడిగా అమెరికా అధ్యక్షుడు Joe Biden  అభిప్రాయపడ్డారుఉక్రెయిన్ మిలటరీ ఆపరేషన్ కు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది.  రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ కు నాటో దళాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి.  

ఉక్రెయిన్ పై తమ మిలటరీ చర్య విషయంలో ఇతరుల జోక్యాన్ని తాము సహించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.   జోక్యం చేసుకొన్న దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పుతిన్ హెచ్చరించారు.

దీంతో ఉక్రయిన్ లో అత్యవసర పరిస్థతిని విధించారు. తమ ఎయిర్ స్పేస్ ను ఉక్రెయిన్ మూసివేసింది.   ఉక్రెయిన్ లో ఖార్కిస్, ఒడెస్సా, పోల్ లో మిస్సైల్స్ తో దాడులు చోటు చేసుకొన్నాయి. డోస్‌బాస్ లో ఉక్రెయిన్ బలగాలను వెనక్కి వెళ్లిపోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. 

ఇదిలా ఉంటే ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని చైనా ప్రకటించింది. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని చైనా కోరింది.

ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో గురువారం నాడు దేశ ప్రజలనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించనున్నారు. ఈ దాడితో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది.

తూర్పు ఉక్రెయిన్ లో తిరుగుబాటు నాయకులు కైవ్ పై సైనిక సహాయం కోసం మాస్కోను కోరినట్టుగా క్రెమ్లిన్ ప్రకటించిన తర్వాత మిలటరీ ఆపరేషన్ ప్రారంభమైందని పుతిన్ ప్రకటించారు. 

బుధవారం నాడు డోనెట్స్ , లుగాన్స్ వేర్పాటువాద నాయకులు పుతిన్ కు వేర్వేరుగా లేఖలు పంపారు. ఉక్రెయిన్ దూకుడును తిప్పికొట్టడానికి  సహాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.

ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని పుతిన్ ప్రకటించారు.  ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకొనే ఉద్దేశ్యం తమకు లేదని పుతిన్ తేల్చి చెప్పారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాలని ఆయన ప్రకటించారు.వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరుల రక్షణకు మిలటరీ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని పుతిన్ వివరించారు. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చవద్దనేది తమ డిమాండ్ అని పుతిన్ తెలిపారు. తమ డిమాండ్ ను అమెరికా దాని మిత్ర దేశాలు విస్మరించాయని ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Army Training Aircraft Crashes: ప్రమాదానికి గురైన విమానం ఎలా రక్షిస్తున్నారో చూడండి | Asianet Telugu
Sabarimala : బంగారం రాగిగా ఎలా మారింది? శబరిమల గుట్టు రట్టు.. హైకోర్టు చివాట్లు ! ఈడీ పంజా