అమిత్ షా పర్యటనలో విధ్వంసం: నెత్తురోడిన పశ్చిమబెంగాల్

By Nagaraju penumalaFirst Published May 14, 2019, 8:14 PM IST
Highlights

బీజేపీ వాహనాలపై రాళ్లు, కర్రలతో తృణమూల్ కాంగ్రెస్ నేతలతోపాటు లెఫ్ట్ పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. వారిపై బీజేపీ నేతలు సైతం దాడులకు దిగారు. దీంతో పశ్చిమబెంగాల్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 
 

పశ్చిమబెంగాల్: పశ్చిమబెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు, వామపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు.  

అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల వర్షం కురిపించారు. అంతేకాదు కర్రలు  విసిరి విధ్వంసం సృష్టించారు. నార్త కలకత్తాలోని వివేకానంద కళాశాల దగ్గర మోటార్ సైకిల్ వాహనానికి నిప్పుపెట్టారు ఆందోళన కారులు. అలాగే ప్రముఖ రచయిత విద్యావేత్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వసం చేశారు. 

అలాగే కళాశాల ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు.  కలకత్తా యూనివర్శిటీ మీదుగా ఉన్న కాలేజీ స్ట్రీట్ లో అమిత్ షా ఎన్నికల ప్రచారం జరుగుతుందని తెలుసుకున్న తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నేతలు దాడులకు దిగారు. 

అయితే కళాశాలలోని బీజేపీ  విద్యార్థి విభాగం, తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగాల మధ్య చెలరేగిన వివాదం విధ్వంసానికి దారి తీసిందని తెలుస్తోంది. మరోవైపు సోమవారం జాధవ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అమిత్ షా ఎన్నికల ప్రచారానికి మమతా సర్కార్ అనుమతి నిరాకరించింది. 

అంతేకాదు అమిత్ షా చాపర్ దిగేందుకు కూడా అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. గత ఏడాది అమిత్ షా చేపట్టిన రథయాత్రను సైతం పశ్చిమబెంగాల్ లో చేపట్టకుండా అడ్డుకున్నారు మమతా బెనర్జీ. శాంతి భద్రతల విషయం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అమిత్ షా యాత్రకు మమత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేతలు. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సోమవారం తన ర్యాలీకి అనుమతి నిరాకరించడం, బీజేపీ రథయాత్రకు కూడా అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ సేవ్ రిపబ్లిక్ ర్యాలీని నిర్వహించింది. 

మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సెంట్రల్ కోల్ కత్తాలో అమిత్ షా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భారీ ఊరేగింపుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం జరిగింది. కలకత్తా యూనివర్శిటీ మీదుగా ఉన్న కాలేజీ స్ట్రీట్ లో అమిత్ షా ఎన్నికల ప్రచారం జరుగుతుండగా ఈ గొడవ జరిగింది. 

బీజేపీ వాహనాలపై రాళ్లు, కర్రలతో తృణమూల్ కాంగ్రెస్ నేతలతోపాటు లెఫ్ట్ పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. వారిపై బీజేపీ నేతలు సైతం దాడులకు దిగారు. దీంతో పశ్చిమబెంగాల్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 

అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీ చార్జ్ చేశారు. అమిత్ షా వాహనంపై జరిగిన రాళ్లదాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. దాడి వెనుక మమతా బెనర్జీ ఉన్నారంటూ ఆరోపించింది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో దాడులకు తెగబడిందని ఆరోపించారు బీజేపీ నేతలు. 

: Visuals after clashes broke out at BJP President Amit Shah's roadshow in Kolkata. pic.twitter.com/laSeN2mGzn

— ANI (@ANI)

 

click me!