దీదీకి సవాల్: కోల్‌కత్తాలో అమిత్ షా రోడ్‌ షో

Published : May 14, 2019, 05:18 PM IST
దీదీకి సవాల్: కోల్‌కత్తాలో అమిత్ షా రోడ్‌ షో

సారాంశం

బీజేపీ చీఫ్ అమిత్ షా కోల్‌కత్తాలో మంగళవారం నాడు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎట్టకేలకు అమిత్ షా ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. రోడ్‌షోలో జై శ్రీరామ్ అంటూ అమిత్ షా నినాదాలు చేశారు.

కోల్‌కత్తా:  బీజేపీ చీఫ్ అమిత్ షా కోల్‌కత్తాలో మంగళవారం నాడు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎట్టకేలకు అమిత్ షా ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. రోడ్‌షోలో జై శ్రీరామ్ అంటూ అమిత్ షా నినాదాలు చేశారు.

బీజేపీ చీఫ్  అమిత్ షా ర్యాలీ నిర్వహణకు ముందు పోలీసులు హడావుడి చేశారు. అమిత్ షా రోడ్ షో నిర్వహణకు సంబంధించి  అనుమతి ఉందా అంటూ పోలీసులు బీజేపీ నేతలను ప్రశ్నించారు. అంతేకాదు బీజేపీకి చెందిన పోస్టర్లు, ఫ్లెక్సీలను కూడ తొలగించారు. అనుమతికి సంబంధించిన పత్రాలను కూడ చూపాలని  కోరారు.

అంతేకాదు బీజేపీ సభా వేదికను కూడ కూల్చివేస్తామని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు బెంగాల్ లో నిరసనకు దిగారు. చివరకు ఈ సభ నిర్వహణకు పోలీసులు పచ్చజెండా ఊపారు.అమిత్ షా జై శ్రీరామ్ అంటూ ర్యాలీలో నినదించారు. కోల్ కత్తాలో తన ర్యాలీని  అడ్డుకోవాలని సవాల్ చేస్తూ అమిత్ షా సవాల్ కూడ విసిరిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Cyber Crime : ఇక సైబర్ నేరాలకు చెక్.. రంగంలోకి స్పెషల్ పోలీసులు
Climate Warning: రక్తంలా మారుతున్న నదులు ! ముంచుకొస్తున్న పెను ముప్పు? అంతమేనా !