ఉరికి వేలాడుతూ కనిపించిన బిజెపి ఎమ్మెల్యే: చంపి ఉరేశారని ఆరోపణ

By telugu teamFirst Published Jul 13, 2020, 11:09 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్యే దేవేంద్ర నాథ్ రాయ్ ఉరికి వేలాడుతూ శవమై కనిపించాడు. దేవేంద్ర నాథ్ రాయ్ ను హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని ఉరికి వేలాడదీశారనే ఆరోపణలు వస్తున్నాయి.

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ బిజెపి శాసనసభ్యుడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. తన స్వగ్రామం బిందాల్ గ్రామానికి సమీపంలో బిజెపి ఎమ్మెల్యే దేవేంద్ర నాథ్ రాయ్ ఉరికి వేలాడుతూ సోమవారం కనిపించాడు. 

అయితే, ఆయనను హత్య చేసి, ఆ తర్వాత ఉరికి వేలాడదీశారని వేంద్ర నాథ్ రాయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. పోస్టుమార్టం చేసిన తర్వాత మరణానికి గల కారణం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయ్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. 

దేవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్ దినాజ్ పూర్ లోని హేమతాబాద్ రిజర్వ్ స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అనతు 2019లో బిజెపిలో చేరారు. దేవేంద్రనాథ్ రాయ్ ను చంపేసి ఆ తర్వాత ఉరి వేశారని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారని పశ్చిమ బెంగాల్ బిజెపి ట్విట్టర్ లో వ్యాఖ్యానించింది. 

ఎమ్మెల్యే మృతిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని బిజెపి నేత రాహుల్ సిన్హా డిమాండ్ చేశారు.  ఈ ఘటనలో తృణమూల్ కాంగ్రెసు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.  రాయ్ గతంలో సీపీఎం ఎమ్మెల్యేగా పనిచేశారు. సీనియర్ నేతల సమక్షంలో ఆయన 2019లో బిజెపిలో చేరారు.

click me!