నిన్నొక్కరోజే 28,701 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసులతో కలిపి ఇప్పటివరకు భారతదేశంలో 8,78,254 కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో కరోనా వైరస్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఏరోజుకారోజు అత్యధిక కేసుల రికార్డు నమోదవుతూనే ఉంది. నిన్నొక్కరోజే 28,701 కేసులు నమోదయ్యాయి.
నిన్నటి కేసులతో కలిపి ఇప్పటివరకు భారతదేశంలో 8,78,254 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. ఇక మరణాల సంఖ్యా కూడా పెరుగుతూనే ఉంది.
నిన్నొక్కరోజే 500 మరణాలు సంభవించాయి. దీనితో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 23,174 కు చేరుకుంది. అధికారిక లెక్కల ప్రకారం 3,01609 ఆక్టివ్ కేసులు ఉండగా 5,53,470 మంది కోలుకున్నారు.
నిన్నొక్కరోజే 2,19,103 సాంపిల్స్ ని టెస్ట్ చేసారు. ఈ టెస్టులతో కలిపి ఇప్పటివరకు దేశంలో 1,18,06,256 సాంపిల్స్ ని టెస్ట్ చేసారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఉత్తరప్రదేశ్ వారాంతాల్లో లాక్ డౌన్ విధిస్తుండగా, బెంగళూరు రురల్, అర్బన్ జిల్లాలు 14వ తేదీ రాత్రి నుంచి 22వ తేదీ ఉదయం వరకు లాక్ డౌన్ ను ప్రకటించాయి.
ఇకపోతే... తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 1,269 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 34,671కి చేరింది.
గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మొత్తం మృతుల సంఖ్య 356కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 28,482 మంది కోలుకుని డిశ్చార్జవ్వగా... 11,883 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read:రాజ్‌భవన్‌లో 10 మందికి కరోనా: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి నెగిటివ్
ఒక్క హైదరాబాద్‌లోనే 800 మందికి పాజిటివ్‌గా తేలగా... రంగారెడ్డి 132, మేడ్చల్ 94, సంగారెడ్డి 36, వరంగల్ అర్బన్ 12, వరంగల్ రూరల్ 2, నిర్మల్ 4, కరీంనగర్ 23, జగిత్యాల 4, యాదాద్రి 7, మహబూబాబాద్ 8, పెద్దపల్లి 9, మెదక్ 14, మహబూబ్‌నగర్ 17, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాలో మూడేసి కేసులు, నల్గొండ 15, సిరిసిల్ల 3, ఆదిలాబాద్ 4, వికారాబాద్ 6, నాగర్‌కర్నూల్ 23, జనగాం 6, నిజామాబాద్ 11, వనపర్తి 15, సిద్ధిపేట 3, సూర్యాపేట 7, గద్వాల్ 7 కేసులు నమోదయ్యాయి.
కాగా మన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా నేటి నుండి 10 రోజుల పాటు లాక్ డౌన్ నిర్వహించనున్నారు. ఇవాళ నిర్వహించిన మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ నిర్వహించడం ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని భావిస్తున్నారు.
Also Read:కరోనాను జయించినా వదలని మృత్యువు.. ఇంటికి వెళ్తుండగా
పెద్దపల్లిలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఆదివారం నాడు కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో 10 రోజుల పాటు స్వచ్చంధంగా లాక్ డౌన్ పాటించాలని నిర్ణయం తీసుకొన్నారు.