
కోల్ కతా : తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎస్ఎస్ కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
ఆయన మరణవార్త తెలుసుకున్న వెంటనే Mamata Banerjee ఆస్పత్రి వద్దకు వెళ్లారు. Subrata Mukherjee మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుబ్రతా ముఖర్జీ ఇక లేరన్న వార్తను నమ్మలేకపోతున్నానన్నారు. ఆయన ఎంతో నిబద్ధత కలిగిన నేత అని కొనియాడారు.
సుబ్రతా ముఖర్జీ deatg తనకు వ్యక్తిగతంగా ఎంతో నష్టం అని తెలిపారు. ఆయనలేని లోటు పూడ్చలేనిదన్నారు. గతవారంలో తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తడంతో సుబ్రతా ముఖర్జీని ఐసీయూలోకి తరలించి చికిత్స అందించినట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు.
రేపు కేదార్‌నాథ్‌కు ప్రధాని మోడీ.. పలు కీలక ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన
ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ లో అక్టోబర్ 30న జరిగిన నాలుగు ఉపఎన్నికల్లో అధికారపార్టీ తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో రెండు BJP స్థానాలనూ తన ఖాతాలో వేసుకున్నట్టయింది. దిన్హాతా, గోసాబా, ఖర్దాహ్, శాంతిపూర్ నియోజకవర్గాలకు Bypolls జరిగాయి. ఇందులో గత అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ గెలిచిన స్థానాలూ ఉన్నాయి.
దిన్హతా, శాంతిపూర్ నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకుంది. కానీ, తాజాగా, జరిగిన ఉపఎన్నికల్లో ఈ రెండు స్థానాలు సహా గోసాబా, ఖర్దాహ్‌లనూ టీఎంసీ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. అంతేకాదు, ఈ నాలుగు చోట్లా మొత్తం కలిపి TMC 75శాతం ఓటు షేర్‌ను సాధించింది. కాగా, బీజేపీ మూడు చోట్లా Deposits కోల్పోయింది.
గతంలో బీజేపీ గెలుచుకున్న దిన్హతా స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహా 1.63 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గోసాబా స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుబ్రతా మోండల్ 1.43 లక్షల ఓట్లతో విజయం సాధించారు. శాంతి పూర్‌లో 64వేల ఓట్ల మెజార్టీతో, ఖర్దాహ్‌లో 93వేల ఓట్ల మెజార్టీతో అధికార పార్టీ విజయపతాకాన్ని ఎగరేసింది.
గెలుపొందిన అభ్యర్థులకు West Bengal సీఎం Mamata Banerjee అభినందనలు తెలిపారు. ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు. దుష్ప్రచారం, విద్వేష రాజకీయాలకు బదులు పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ధినే ఎంచుకుంటారని ట్వీట్ చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ఎప్పట్లాగే రాష్ట్రాన్ని మరిన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తామని హామీనిచ్చారు.
బీజేపీ నుంచి టీఎంసీకి మళ్లీ వలసలు మొదలైన నేపథ్యంలో ఈ ఉపఎన్నికలో గెలవడం కమలం పార్టీకి అత్యావశ్యకమైంది. కానీ, ఈ నాలుగు స్థానాల్లో అంటే, బీజేపీకి కంచుకోటగా భావించే కూచ్‌బెహార్ పరిధిలోని దిన్హాతాలోనూ పరాజయం పాలవ్వడంతో పార్టీవర్గాలు నిరాశలో మునిగాయి.
గత నెల 30వ తేదీన అసోంలోని ఐదు అసెంబ్లీ స్థానాలు, West Bengal లో నాలుగు స్థానాలు,. మధ్యప్రదేశ్ లో మూడు స్థానాలు, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, బీహార్ రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ స్థానాలు, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, తెలంగాణలోని ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.