రైలు పట్టాలపై బాంబు.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు

Published : Jan 09, 2019, 01:06 PM IST
రైలు పట్టాలపై బాంబు.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు

సారాంశం

గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించేందుకు అక్కడ బాంబును పెట్టినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

రైలు పట్టాలపై దుండగులు బాంబుని ఏర్పాటు చేసిన సంఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఉత్తర 24పరగణాల జిల్లాలోని రైల్వే ట్రాక్ పై బాంబు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించేందుకు అక్కడ బాంబును పెట్టినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

కాగా.. దానిని గుర్తించిన  ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించి.. దానిని బాంబుగా గుర్తించారు. వెంటనే బాంబు స్వ్కాడ్ ని పిలిపించి.. దానిని నిర్వీర్యం చేశారు. అప్పటి తో భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. 

దీని కారణంగా కొన్ని గంటలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాంబుని నిర్వీర్యం చేసిన అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !