రూపాయి కూడా జీతం తీసుకోని మమత.. పుస్తకాలతోనే ఆదాయం

By Siva KodatiFirst Published Apr 20, 2019, 11:56 AM IST
Highlights

రాష్ట్రానికి ముఖ్యమంత్రైనా ఎంతో నిరాడంబరంగా ఉండే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు

రాష్ట్రానికి ముఖ్యమంత్రైనా ఎంతో నిరాడంబరంగా ఉండే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తాను బెంగాల్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా జీతంగా తీసుకోలేదని వెల్లడించారు. ఇంకా ఆమె ఏం చెప్పారంటే... తనకు నిరాడంబర జీవితం అంటే ఇష్టమని... సీఎంగా ఎనిమిదేళ్ల పదవి కాలంలో తాను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విత్ డ్రా చేయలేదన్నారు.

ఇన్నేళ్లలో తాను ఒక్కసారి కూడా విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించలేదన్నారు. తాను గెస్ట్‌హౌస్‌లో ఉంటే తన సొంత డబ్బులే ఖర్చు పెట్టుకుంటానన్నారు. తనకు నెలకు పెన్షన్‌గా రూ. లక్ష, సీఎంగా జీతం మరో లక్ష వస్తాయన్నారు.

చివరికి టీ కూడా తన డబ్బులతోనే తాగుతానన్నారు. ఇప్పటి వరకు 86 పుస్తకాలను పబ్లిష్ చేశానని, అలాగే పెయింటింగ్స్ ద్వారా వచ్చిన డబ్బులను కొంత దాచుకుని కొంత విరాళంగా ఇచ్చేస్తానన్నారు.

నా పుస్తకాలు, సాహిత్యం, పెయింటింగ్స్ అమ్మన ద్వారా వచ్చిన డబ్బులను ఖర్చు పెట్టుకుంటానని... అలా సుమారు రూ.11 లక్షల ఆదాయం వచ్చిందని.. ఆ డబ్బంతా తానేం చేసుకుంటానని అన్నారు. తాజా ఇంటర్వ్యూతో ఆమె మరోసారి అభిమానుల మనసు దోచుకున్నారు. ఈమెలో దాగివున్న టాలెంట్ బయటి ప్రపంచానికి తెలిసింది. 

click me!