నా డ్యూటీ అయిపోయిందని.. రైలుని మధ్యలోనే వదిలేశాడు

Published : Apr 20, 2019, 10:42 AM IST
నా డ్యూటీ అయిపోయిందని.. రైలుని మధ్యలోనే వదిలేశాడు

సారాంశం

తన డ్యూటీ టైమ్ అయిపోయిందని చెప్పి.. ఓ డ్రైవర్ రైలుని దారిలోని ఆపేసి వెళ్లిపోయాడు. ఈ వింత సంఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలో చోటుచేసుకుంది. 

తన డ్యూటీ టైమ్ అయిపోయిందని చెప్పి.. ఓ డ్రైవర్ రైలుని దారిలోని ఆపేసి వెళ్లిపోయాడు. ఈ వింత సంఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం నేలబొగ్గుతో కరైక్కాల్ పోర్టు వైపు వెళ్తున్న గూడ్స్ రైలు శీర్గాలి సమీపంలో ఆగిపోయింది. సరిగ్గా లెవల్ క్రాసింగ్, రైల్వే గేటుకు మధ్యలో రైలును ఆపేసి డ్రైవర్ ముత్తురాజ్ కిందకు దిగేశాడు.

తన డ్యూటీ సమయం ముగిసి అప్పటికే అరగంట అవుతోందని.. అయినా ఇంకా మరో డ్రైవర్ రాలేదని ముత్తురాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన వస్తువులు తీసుకొని ఇంటి వెళ్లడానికి కూడా సిద్ధపడ్డారు.  ఇదిలా ఉంటే లెవల్ క్రాసింగ్ వద్ద రైలు ఆగడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. వెంటనే ఈవిషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేశారు.

రైల్వే అధికారులు ముత్తిరాజ్ కి నచ్చచెప్పడంతో.. తిరిగి ఆయన రైలును అక్కడి  నుంచి ముందుకు పోనించాడు. దాదాపు గంటపాటు రైలు కదలకపోవడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu