
ఎంఐఎం పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మంగళవారం కూచ్ బీహార్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ.. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై పరోక్షంగా విమర్శలు చేశారు.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ పార్టీ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని.. ఆ పార్టీని అతివాద పార్టీగా అభివర్ణించిన దీదీ.. ఇటువంటి శక్తులను నమ్మకూడదని మైనార్టీలకు పిలుపునిచ్చారు.
Also read:బీహార్ లో అసదుద్దీన్ ఎంఐఎం బోణీ: కేంద్ర మంత్రి గిరిరాజ్ తీవ్ర వ్యాఖ్యలు
అదే సమయంలో హిందూ అతివాద శక్తుల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మమత వ్యాఖ్యానించారు. 2011 నుంచి పశ్చిమ బెంగాల్ సీఎంగా కొనసాగుతున్న మమతా బెనర్జీ.. 2021 అసెంబ్లీలో ఎన్నికల్లోనూ గెలవాలని గట్టి పట్టుదలగా ఉన్నారు.
మరోవైపు దీదీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తనపైనా, తన పార్టీపైనా తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా పశ్చిమబెంగాల్‌లో ఎంఐఎం తిరుగులేని శక్తిగా ఉందనే విషయాన్ని మమత స్వయంగా ఒప్పుకున్నారని ఒవైసీ పేర్కొన్నారు.
Also Read:మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం దెబ్బ: కాంగ్రెస్ ఢమాల్, బీజేపీ కూటమి జోరు
కేవలం భయాలు, నిరాశా నిస్పృహల కారణంగానే మమతా బెనర్జీ ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్‌లో ప్రత్యర్థులను నిలువరించే విషయంలో మమత సామర్ధ్యాన్ని అసదుద్దీన్ ప్రశ్నంచారు.
బెంగాల్‌లో కేవలం 2 సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ.. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు ఎలా గెలుచుకుందని ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మా కొద్ది మంది గురించి బాధపడిపోతున్న మమతా బెనర్జీ బెంగాల్‌లో బీజేపీకి 18 సీట్లు ఎలా వచ్చాయో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు.