రాష్ట్రపతి ఎన్నికలపై విపక్షాలతో మమత భేటీ ప్రారంభం: నేతలను రిసీవ్ చేసుకున్న దీదీ

Published : Jun 15, 2022, 03:24 PM ISTUpdated : Jun 23, 2022, 06:03 PM IST
రాష్ట్రపతి ఎన్నికలపై విపక్షాలతో మమత భేటీ ప్రారంభం: నేతలను రిసీవ్ చేసుకున్న దీదీ

సారాంశం

రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై విపక్షాలతో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన పలు పార్టీల నేతలను మమత బెనర్జీ సాదరంగా ఆహ్వానించారు. 22 పార్టీలకు మమత బెనర్జీ ఆహ్వానం పంపారు. 

న్యూఢిల్లీ:President  Electionలలో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించేందుకు విపక్ష పార్టీల నేతలతో West Bengal సీఎం  Mamata Banerjee   బుధవారం నాడు సమావేశమయ్యారు.  ఈ సమావేశానికి  Congress  పార్టీ తరపున మల్లికార్జునఖర్గే, రణదీప్ సూర్జేవాలా, జైరాం రమేష్, ఎన్సీపీ నేత శరద్ పవార్,  ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం నుండి ఆ పార్టీ ఎంపీ కరీం, నేషనల్ కాన్పరెన్స్ నుండి ఒమర్ అబ్దుల్లా హాజరయ్యారు.

ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన పలు పార్టీల నేతలను పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆహ్వానించారు. ఆర్జేడీ నుండి మనోజ్ ఝా, ఏడీ సింగ్, శివసేన తరపున ప్రియాంక చతుర్వేది, సుభాష్ దేశాయ్, జేడీఎస్ నుండి హెచ్ డీ కుమారస్వామి, డీఎంకె నుండి టీఆర్ బాలు సమావేశానికి హాజరు కానున్నారు. 

ఈ సమావేశానికి టీఆర్ఎస్,AAP దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్  తో కలిసి వేదికను పంచుకోవడం ఇష్టం లేకపోవడంతోనే ఈ సమావేశానికి TRS దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఈ సమావేశానికి ఎంఐఎంకి ఆహ్వానం రాలేదని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఓ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు. ఈ సమావేశానికి ఆహ్వానం అందినా కూడా తాను పాల్గొనబోమని కూడా ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ఎన్నికలపై విపక్షాలు ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపాలని భావిస్తున్నాయి. అయితే విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా గోపాలకృష్ణ గాంధీని బరిలోకి దింపే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో శరద్ పవార్ పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కూడా విపక్షాలతో ఇదే విషయమై చర్చలు చేస్తున్న సమయంలో మమత బెనర్జీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఆ పార్టీకి షాకిచ్చింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో తాము బరిలో దింపే అభ్యర్ధికి మద్దతివ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేకు బుధవారం నాడు ఫోన్ చేశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఎవరిని తన అభ్యర్ధిగా బరిలోకి దింపుతుందోననే విషయం ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపున శరద్ పవార్ ను బరిలోకి దింపాలని భావించారు. కానీ క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలని శరద్ పవార్ భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఇప్పటికే ఆయన ప్రకటించారు అయితే ఈ ప్రకటన చేసిన తర్వాత శరద్ పవార్ తో మమత బెనర్జీ భేటీ కావడం చర్చకు దారి తీసింది. ఇవాళ జరిగిన సమావేశానికి పవార్ కూడా హాజరయ్యారు.

also read:టీఆర్ఎస్ బాటలోనే ఆప్: మమత మీటింగ్ కి కేజ్రీవాల్ పార్టీ దూరం

ఈ సమావేశానికి టీఆర్ఎస్, ఆప్ లు దూరం కావాలని నిర్ణయం తీసుకోవడం మమత బెనర్జీ చేస్తున్న ప్రయత్నాలకు కొంత ఇబ్బందిని కల్గించే అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో వేదికను పంచుకోవడం ఇష్టం లేక టీఆర్ఎస్ ఈ సమావేశానికి దూరంగా ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకొంటామని ఆప్ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్
గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?