
న్యూఢిల్లీ: తమ పార్టీ కార్యకర్తలపై New Delhi లో జరిగిన దాడులను నిరసిస్తూ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో Rajbhavan ను ముట్టడించాలని Congress పార్టీ పిలుపునిచ్చింది. బుధవారం నాడు
కాంగ్రెస్ పార్టీ నేత Randeep Surjewala మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కార్యాలయంలోకి వచ్చి పోలీసులు తమపై దాడికి దిగారన్నారు. ఢిల్లీ పోలీసులు గుండాల్లా వ్యవహరించారని సూర్జేవాలా ఆరోపించారు. పార్టీ కార్యాలయం గేట్లను తోసుకొని వచ్చి తమ పార్టీ నేతలను అరెస్ట్ చేశారన్నారు. ఢిల్లీ పోలీసుల తీరుపై సూర్జేవాలా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఢిల్లీ పోలీసులు మంటగలిపారని ఆయన విమర్శించారు. పోలీసులు వ్యవహరించిన తీరును నేరపూరితంగా ఉందన్నారు. దీన్ని తాము సహించబోమన్నారు.
పార్టీ కార్యాలయంలోకి వచ్చి తమ పార్టీ నేతలపై దాడికి దిగిన పోలీసులపై FIR నమోదు చేయాలని రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. అంతేకాదు పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు
కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. Enforcement Directorate పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని ఢీల్లీ పోలీసులు తెలిపారు. అక్బర్ రోడ్, ఈడీ కార్యాలయం చుట్టూ ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని కాంగ్రెస్ నేతలకు లిఖితపూర్వకంగానే మంగళవారం నాడు రాత్రి సమాచారం అందించామని ఢిల్లీ శాంతిభద్రతల విభాగం స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా చెప్పారు.
144 సెక్షన్ ను ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తాము అదుపులోకి తీసుకున్నామని స్పెషల్ సీపీ వివరించారు. గత రెండు రోజులుగా నిభంధనలు ఉల్లంఘించిన 800 మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇవాళ నిరసనలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. సెక్షన్ 144 విధించిన ప్రాంతం గురించి కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలుసునన్నారు.
మూడు రోజులుగా రాహుల్ గాంధీని ఈడీ అధికారుల ప్రశ్నిస్తున్నారు నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ మూడు రోజులుగా ఈడీ అధికారుల విచారణకు హాజరౌతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ పేరుతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను వేధింపులకు గురి చేస్తున్నారని బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇవాళ కూడా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేసే సమయంలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు వ్యవహరించిన తీరుపై రనదీప్ సూర్జేవాలా మీడియా సమావేశంలో వీడియోను చూపారు. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు.
ఈడీ విచారణకు సోనియాగాంధీ ఇంకా హాజరు కాలేదు. కరోనా తర్వాత సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
మంగళవారం నాడు రాత్రి 10 గంటల సమయంలో ఈడీ విచారణ నుండి రాహుల్ గాంధీ బయటకు వచ్చారు. రాహుల్‌గాంధీపై ఈడీ విచారణకు నిరసనగా రెండో రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో నిరసన తెలిపారు