CM vs Governor: రచ్చకెక్కిన వివాదం.. గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన సీఎం

Published : Jan 31, 2022, 05:40 PM IST
CM vs Governor: రచ్చకెక్కిన వివాదం.. గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన సీఎం

సారాంశం

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ మధ్య వివాదం రచ్చకెక్కింది. గవర్నర్ జగదీప్ ధన్కర్ ట్విట్టర్‌ను తన ఖాతా నుంచి బ్లాక్ చేసినట్టు సీఎం బెనర్జీ ఏకంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే వెల్లడించారు. ఆయన ప్రతి రోజూ ఏదో అంశంపై తమను, తమ అధికారులను దూషిస్తున్నారని, ఆయనను తొలగించాలని చాలా సార్లు ప్రధాని మోడీకి లేఖలు కూడా రాశామని పేర్కొన్నారు. కానీ, ప్రధాని ఆయనను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం పెగాసెస్ స్పైవేర్ జగదీప్ ధన్కర్ నివాసం నుంచే నడుస్తున్నదని ఆరోపించారు.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee), రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ (Governor Jagdeep Dhankhar) మధ్య వివాదం రచ్చకెక్కింది. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య పొసగడం లేదని తెలుస్తూనే ఉన్నది. కానీ, ఏకంగా ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో ప్రకటించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన సృష్టించారు. తాను తన ట్విట్టర్ అకౌంట్‌లో గవర్నర్ జగదీప్ ధన్కర్‌ను బ్లాక్(Twitter Account Block) చేసినట్టు వెల్లడించారు. కొన్నేళ్లుగా వీరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. కానీ, ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రజాస్వామ్యానికి ఒక గ్యాస్ చాంబర్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలు వారి మధ్య విభేదాలను పరాకాష్టకు తీసుకెళ్లాయి. ఈ తరుణంలోనే సీఎం మమతా బెనర్జీ ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేశారు.

‘నేను అడ్వాన్స్‌గా క్షమాపణలు చెబుతున్నాం. కానీ, ఆయన(జగదీప్ ధన్కర్) ప్రతి రోజూ ఏదో వంకతో మమ్మల్ని, మా అధికారులను దూషిస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధమైన, అనైతికమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన సూచనలు చేయరు. ఏకంగా ఆదేశాలే ఇస్తుంటారు. ఎన్నుకున్న ప్రభుత్వమే వెట్టి కూలీగా మారింది. అందుకే నా ట్విట్టర్ అకౌంట్‌ నుంచి ఆయనను బ్లాక్ చేశాను. ఈ వ్యవహారంతో నేను ఇర్రిటేట్ అవుతున్నాను’ సీఎం మమతా బెనర్జీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

‘నేను చాలా సార్లు పీఎం మోడీకి లేఖలు రాశాను. ఆ గవర్నర్ అసలు వినడు, ఎవరిని పడితే వారిని బెదిరిస్తూ ఉంటారు. నేరుగా ఆయన వద్దకు వెళ్లి కూడా ఈ విషయంపై మాట్లాడాను’ అని వివరించారు. గతేడాది కూడా తాము ఆ గవర్నర్‌ను భరించామని అన్నారు. ఆయన చాలా ఫైళ్లను క్లియర్ చేయలేదని, వాటిని అలాగే పెండింగ్‌లో పెడుతున్నాడని ఆరోపించారు. ఆయన విధానపరమైన నిర్ణయాల గురించి ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు. గవర్నర్ విషయమై తాను ప్రధాని మోడీకి కనీసం నాలుగు లేఖలైనా రాశానని తెలిపారు.

రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలను బెదిరిస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ ఆయనను గవర్నర్ పదవి నుంచి ఎందుకు తొలగించరు? అని ప్రశ్నించారు. పెగాసెస్ స్పైవేర్ ఆయన నివాసం నుంచే నడుస్తున్నదని తెలిపారు. ఆయన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పెగాసెస్ స్పైవేర్ ఉపయోగించి ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకంత మజుందార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సీఎం మమతా బెనర్జీ పెగాసెస్ ఆరోపణలను చేశారు. గవర్నర్ జగదీప్ ధన్కర్‌పై ఆరోపించారు.

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ జగదీప్ ధన్కర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మానవ హక్కుల హనానికి ల్యాబ్‌‌గా, రక్తపాతంతో నిండిన దుర్భర దరిత్రిగా బెంగాల్‌ను చూడలేమని అన్నారు. మన ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్రాన్ని ఓ గ్యాస్ చాంబర్‌గా మారుస్తున్నారని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం