అయోధ్య సరయు నది ఒడ్డున కుక్క పిల్లతో బాలుడి ఆట: సోషల్ మీడియాలో వీడియో వైరల్

By narsimha lode  |  First Published Jan 24, 2024, 4:52 PM IST


సోషల్ మీడియాలో  వినూత్నంగా కన్పించే ఫోటో లేదా వీడియోను  నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
 


న్యూఢిల్లీ: అయోధ్యలోని సరయు నది ఒడ్డున ఓ బాలుడు ఓ కుక్కు పిల్లతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శిరీష్ వ్యాస్ అనే నెటిజన్  ఇన్ స్టాగ్రామ్  ఈ వీడియోను  పోస్టు చేశారు.   ఈ వీడియో పోస్టు చేసిన కొద్ది నిమిషాల్లో  వైరల్ గా మారింది. కుక్కపిల్లతో ఒక బాలుడు  ఆనందంగా ఆడుకుంటున్న  వీడియో  నెట్టింట చక్కర్లు కొడుతుంది.  ఈ వీడియోను పదే పదే చూడాలనిపిస్తుందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.  

also read:కొత్తగా పెళ్లైన మహిళ డ్యాన్స్: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో

Latest Videos

ఈ వీడియో  అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే  3,15,000 లైక్ లు  సంపాదించింది.  అంతేకాదు వీక్షకులు  ఈ వీడియోను చూసి కామెంట్లు పెడుతున్నారు.  ఈ వీడియోను చూసిన  నెటిజన్లు  భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

ఒక శిశువు మరొక బిడ్డను మోస్తున్నాడని  ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. తెలివైన వారు కలిసి అద్భుతమైన సమయాన్ని గడుపుతున్నారు.. ఆనందించండని మరొకరు వ్యాఖ్యానించారు. కుక్క పిల్లలు నిజంగా అద్బుతమైనవి అనే సెంటిమెంట్ కామెంట్ జోడించారు. లవ్ ఇట్... టూ క్యూట్ టూ అంటూ మరోకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియో  ఇంటర్నెట్ లో ఆనందాన్ని పంచుతూనే ఉంది. ఈ వీడియోను చూసిన  వీక్షకులు  తమ భావాలను  వీడియో కింద పోస్టు చేస్తున్నారు.
 

click me!