పశ్చిమ బెంగాల్ లో బంగారు బిస్కెట్ల పట్టివేత.. వాటి విలువ తెలిస్తే తిమ్మతిరగాల్సిందే.. 

By Rajesh KarampooriFirst Published Mar 7, 2023, 4:35 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ లోని భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు లో 98 లక్షల విలువైన 15 బంగారు బిస్కెట్లను ఓ స్మగ్లర్ వద్ద బీఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి.

సరిహద్దు భద్రతా దళం (BSF) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సోమవారం నాడు భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు నుండి  రూ. 98 లక్షల కంటే ఎక్కువ విలువైన 15 బంగారు బిస్కెట్ల తో ఒక భారతీయ స్మగ్లర్‌ను పట్టుకుంది. ఇంటలిజన్స్ సమాచారం ప్రకారం ఈ అపరేషన్ చేసినట్టు సమా..  దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లాలో మోహరించిన ఉత్తర బెంగాల్ ఫ్రాయింటర్‌లోని రాయ్‌గంజ్ సెక్టార్‌లో మంజురుల్ షేక్‌ అనే స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నారు.  

98,75,578.50 విలువైన 15 విలువైన బంగారు బిస్కెట్లను స్మగ్లర్ తన బైక్ కుహరంలో రహస్యంగా , అక్రమంగా తీసుకెళ్తుండగా బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయని బీఎస్ఎఫ్ తెలిపింది. బంగారు బిస్కెట్ల అక్రమ డెలివరీ కోసం హరిపోఖర్ నుంచి త్రిమోహనికి తరలిస్తున్నాడు.  బంగ్లాదేశ్ నివాసి ఇసతాఖ్ నుంచి ఈ బంగారు బిస్కెట్లను అందుకున్నాడు , వాటిని బంగ్లాదేశ్‌లోని దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లాలోని శంకర్ సాహాకు తన బావ సాగర్ మొండల్ ద్వారా డెలివరీ చేయబోతున్నాడని మంజురుల్ షేక్ వెల్లడించారు.

 ఈ ఘటనపై బీఎస్ఎఫ్ స్పందిస్తు.. అతను గోల్డ్ బిస్కెట్ల క్యారియర్‌గా పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు కూడా రహస్యంగా డెలివరీ చేయబడ్డాడు. స్వాధీనం చేసుకున్న వస్తువులతో పట్టుబడిన భారతీయ జాతీయుడిని కస్టమ్ ఆఫీస్, బాలూర్‌ఘాట్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపింది. దీనికి ముందు, మార్చి 2, 2023 న, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లాలోని బాలూర్‌ఘాట్ నుండి రూ. 10 లక్షలు విలువైన బంగారు బిస్కెట్‌ను ఓ భారతీయ స్మగ్లర్ నుంచి పట్టుబడ్డాడు. ఇటీవల.. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్‌లో తన పొత్తికడుపులో రూ.54.7 లక్షల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని బిఎస్‌ఎఫ్ అరెస్టు చేసింది.

click me!