అక్షరాల్లో రాష్ట్రాన్ని ముందుకు తేవడానికి.. రాష్ట్రం పేరును మార్చిన మమత.. మోడీ ఒప్పుకుంటారా..?

First Published Jul 26, 2018, 6:17 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ పేరును మార్చాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాష్ట్రం పేరును మార్చాలని ఎప్పటి నుంచో ప్రజల్లో డిమాండ్ ఉంది.. మారుస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రకటించారు

పశ్చిమ బెంగాల్ పేరును మార్చాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాష్ట్రం పేరును మార్చాలని ఎప్పటి నుంచో ప్రజల్లో డిమాండ్ ఉంది.. మారుస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రకటించారు. దీనిలో భాగంగా 2016 ఆగస్టులో బెంగాల్ పేరు మారుస్తూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదనను పంపింది..

అయితే ఆ తీర్మానంలో రాష్ట్రం పేరును బెంగాలీలో బంగ్లా అని.. హిందీలో బంగాల్ అని.. ఇంగ్లీష్‌లో బెంగాల్ అని పేర్కొన్నారు. వేరు వేరుగా కాదని.. అన్ని భాషల్లో ఒకే పేరు ఇవ్వాలని కేంద్రం మమతా బెనర్జీ ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్రం పేరును ‘‘బంగ్లా’’గా మారుస్తూ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం చేసింది.

వెస్ట్ బెంగాల్ పేరు అక్షరక్రమంలో ‘డబ్ల్యూ’ అన్న పదంతో మొదలవుతుంది.. దీంతో బెంగాల్ అక్షరక్రమంలో అన్ని రాష్ట్రాల తర్వాత చివరన వస్తుంది.. దీంతో తమ రాష్ట్రం పేరు మార్చాలని ఆ రాష్ట్రం పట్టుబడుతోంది. ప్రస్తుత తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ ఆమోదిస్తే... బెంగాల్ పేరు ‘‘బంగ్లా’’గా మారుతుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోడీ సర్కార్ మమత ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
 

click me!