సైకిల్‌పై నుంచి కింద పడ్డ లాలూ తనయుడు, తప్పిన ప్రమాదం (వీడియో)

Published : Jul 26, 2018, 05:06 PM IST
సైకిల్‌పై నుంచి కింద పడ్డ లాలూ తనయుడు, తప్పిన ప్రమాదం (వీడియో)

సారాంశం

లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఇవాళ సైకిల్ యాత్రలో భాగంగా సైకిల్ పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదం నుండి ఆయన సురక్షితంగా బైటపడ్డారు.  

అసలేం జరిగిందంటే... కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, ఢీజిల్ ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ సైకిల్ ర్యాలీ కి చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన కార్యకర్తలతో కలిసి సైకిల్ ని స్వయంగా నడుపుకుంటూ వెడుతుండగా సెక్యూరిటీ వాహనాలు ఆయన్ని ఫాలో అయ్యాయి. ఈ క్రమంలో కాస్త స్పీడ్ గా వెళుతున్న ఆయన సైకిల్ ఓ మలుపు వద్ద సెక్యూరిటీ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో తేజస్వి కిందపడిపోయాడు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది తేజ్ ప్రతాప్ ని పైకి లేపారు. అయితే ఈ ఘటనలో తేజ్ ప్రతాప్ కి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగా బైటపడ్డారు. 
 
వీడియో

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?