ఆయనే మా సీఎం అభ్యర్ధి.. గోవా ఎన్నికలపై జేపీ నడ్డా స్పందన

Siva Kodati |  
Published : Jul 25, 2021, 07:53 PM IST
ఆయనే మా సీఎం అభ్యర్ధి.. గోవా ఎన్నికలపై జేపీ నడ్డా స్పందన

సారాంశం

గోవా సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీలో పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటన చేస్తుందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. అయితే ప్రమోద్ సావంత్ గోవాను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు.  

గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ఆయనతోనే (ముఖ్యమంత్రి అభ్యర్థిగా) ఎన్నికలకు బీజేపీ వెళ్తుందని చెప్పారు. ఆదివారం మీడియాతో నడ్డా మాట్లాడుతూ,  సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీలో పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటన చేస్తుందని స్పష్టం చేశారు.

అయితే, వేరే పేర్ల గురించి ఆలోచించాల్సిన పని లేదని, ప్రమోద్ సావంత్ గోవాను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చక్కటి పనితీరు ప్రదర్శిస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలతో తాను జరిపిన సమావేశంలో ఎమ్మెల్యేలు ఎంతో ఆశావవహంగా, ధీమాతో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు బీజేపీలో చేరుతున్నారని, వారితో తాను సమగ్ర చర్చలు జరిపానని పేర్కొన్నారు.

రాష్ట్రంలో బీజేపీ పనితీరు పట్ల అందరూ సంతృప్తికరంగా ఉన్నారని చెప్పారు. గత నాలుగున్నరేళ్లలో గోవా గణనీయమైన అభివృద్ధి సాధించిందని నడ్డా తెలిపారు. అలాగే 'స్పూప్‌గేట్' వివాదంపై అడిగినప్పడు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవన్నారు. ప్రజా సంబంధిత అంశాలేవీ లేనందునే ఇలాంటి ఆరోపణలకు వాళ్లు దిగుతున్నారని నడ్డా వ్యాఖ్యానించారు.
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?