హిమాచల్‌ప్రదేశ్‌లో విషాదం: కొండచరియలు విరిగిపడి 9 మంది టూరిస్టుల మృతి

By narsimha lodeFirst Published Jul 25, 2021, 4:53 PM IST
Highlights

హిమాచల్‌ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి చెందిన ఘటన ఆదివారం నాడు చోటు చేసుకొంది.ఢిల్లీకి చెందిన పర్యాటకుల కారుపై బండరాళ్లు పడి 9 మంది మరణించారు. మరో 3 గాయపడ్డారు. ఓ కొండపై నుండి బండరాళ్లు ఓ వంతెనపై పడ్డాయి.

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయల్ ఆదివారంనాడు విషాదం చోటు చేసుకొంది. కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఓ కొండపై నుండి  బండరాళ్లు వేగంగా వచ్చి ఓ వంతెనపై పడ్డాయి.  ఈ ప్రాంతాన్ని చూసేందుకు ఢీల్లి నుండి వచ్చిన 11 మంది పర్యాటకుల కారుపై బండరాళ్లు పడ్డాయి. దీంతో 9 మంది అక్కడికక్కడే మరణించారని కిన్నౌర్ ఎస్పీ సాజు రామ్ రానా చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పిచి చికిత్స అందిస్తున్నామన్నారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు కూడ చోటు చేసుకొంటున్నాయి. మహారాష్ట్రాలోని రాయ్‌ఘడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన ఓ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. రాయ్‌ఘడ్ జిల్లాలోని తలై గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకొంది.  హిమాచల్‌ప్రదేశ్ లోని ప్రకృతి అందాలను తిలకించేంందుకు వచ్చిన పర్యాటకులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.


 

click me!