ప్రేమాయణం: యువకుడి మర్మాంగాన్ని కోసేసిన ప్రేయసి అన్నలు

Published : Jul 25, 2021, 06:17 PM IST
ప్రేమాయణం: యువకుడి మర్మాంగాన్ని కోసేసిన ప్రేయసి అన్నలు

సారాంశం

బీహార్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తమ చెల్లెను ప్రేమించాడనే కోపంతో ఆమె సోదరులు ఓ యువకుడిపై దాడి చేశారు. యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

పాట్నా: బీహార్ లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. తమ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడనే కోపంతో కొంత మంది యువకుడి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఈ సంఘటన మజుఫర్ పూర్ లో జరిగింది. రేువరా రాంపూర్ గ్రామానికి చెందిన సౌరభ్ కుమార్ అనే యువకుడు తన పక్క గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. 

సౌరఫ్ ప్రతి రోజూ సోర్బారా గ్రామానికి వెళ్లి తన ప్రేయసిని కలుకుంటుండేవాడు. వారి ప్రేమ గురించి యువతి ఇంట్లో తెలిసింది. దాంతో యువతిపై ఆమె అన్నలు కోపంతో ఉన్నారు. గత శుక్రవారం ఎప్పటిలాగే సౌరబ్ తన ప్రేయసిని ఇంట్లో తెలియకుండా కలుసుకున్నాడు. అయితే, వారిద్దరినీ సోదరులు పట్టుకున్నారు. సౌరబ్ ను దూరంగా లాక్కుపోయారు. 

అతన్ని ఇనుపకడ్డీలతో, రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. అతన్ని మర్మాంగాన్ని కోసేశారు. దాంతో యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, బాధితుడి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

సౌరబ్ ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్రమైన రక్తరస్రావంతో కావడంతో సౌరబ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దాంతో ఆగ్రహించిన బాధితుడి బంధువులు యువతి ఇంటి ముందు సౌరబ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి బంధువులు, యువతి సోదరులపై ఫిర్యాదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu