బావిలో ప‌డ్డ గోవును ర‌క్షించ‌డానికి వెళ్లి ఐదుగురు మృతి..

Published : Aug 18, 2023, 09:06 AM IST
బావిలో ప‌డ్డ గోవును ర‌క్షించ‌డానికి వెళ్లి ఐదుగురు మృతి..

సారాంశం

Ranchi: బావిలో ప‌డ్డ గోవును ర‌క్షించ‌డానికి వెళ్లి ఐదురుగు మృతి చెందారు. గోవును బావిలోంచి బయటకు తీస్తుండగా బావిలోని ఒక భాగం కూలింది. దీంతో బావిలో ఉన్న ఏడుగురిలో ఐదుగురు మృతి చెంద‌గా, ఇద్దరిని రక్షించగలిగారు. ఈ విషాదక‌ర ఘ‌ట‌న జార్ఖండ్ లో చోటుచేసుకుంది.   

5 Killed After Portion Of Well Collapses: బావిలో ప‌డ్డ గోవును ర‌క్షించ‌డానికి వెళ్లి ఐదురుగు మృతి చెందారు. గోవును బావిలోంచి బయటకు తీస్తుండగా బావిలోని ఒక భాగం కూలింది. దీంతో బావిలో ఉన్న ఏడుగురిలో ఐదుగురు మృతి చెంద‌గా, ఇద్దరిని రక్షించగలిగారు. ఈ విషాదక‌ర ఘ‌ట‌న జార్ఖండ్ లో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలోని సిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. మురి ఓపీ ప్రాంతంలోని పిస్కా గ్రామంలో బావిలోని ఒక‌భాగం కూలి ఏడుగురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిలో ఐదుగురు మృతి చెందగా, ఇద్ద‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఇప్ప‌టివ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం ఓ ఎద్దు బావిలో పడిపోయింది. ఎద్దును రక్షించేందుకు నలుగురు బావిలోకి దిగారు. వారు బావిలో నుంచి ఎద్దును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే,  బావి చుట్టూ ఉన్న మట్టి అకస్మాత్తుగా కూలిపోవ‌డంతో మొత్తం ఏడుగురు మట్టిలో కూరుకుపోయారు. ఇద్దరు సురక్షితంగా బయటపడగా, ఐదుగురు మృతి చెందారు. స్థానిక ఎమ్మెల్యే, ఏజేఎస్ యూ చీఫ్ సుదేశ్ మహతో కూడా పోలీసు అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం బావిలో నుంచి ఐదు మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఎద్దులను బయటకు తీస్తుండగా ఏడుగురు మట్టిలో కూరుకుపోయారని సిల్లీ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఆకాశ్ దీప్ తెలిపారు. వీరిలో ఇద్దరిని సురక్షితంగా రక్షించగా, ఐదుగురు మృతి చెందారు. ప్రస్తుతం ఒక మృతదేహాన్ని వెలికితీసి, మిగిలిన మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా నలభై అడుగుల లోతులో కూరుకుపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారుతున్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.

సిల్లీ సమీపంలోని మురి వద్ద ఈ ఘటన జరిగిందని రాంచీ నగర ఎస్పీ షుంబ్షు జైన్ తెలిపారు. ఈ స్థలంలో ఏడెనిమిది మంది మట్టిలో కూరుకుపోయినట్లు సమాచారం అందింద‌నీ, స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాన్నిరంగంలోకి దింపిన‌ట్టు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..