
ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వధువుకు జుట్టు తక్కువగా ఉందని ఓ వరుడు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో చోటుచేసుకుంది. ముహూర్తానికి కొద్ది సమయానికి ముందు వరుడు ఈ కారణంతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరుకుంది. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. యూపీలోని అయోధ్య బికాపూర్ ప్రాంత యువతికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ మేరకు ఇరు కుటుంబీకులు వీరికి పెళ్లి కుదిరించారు.
ఆ పెళ్లి పందిరి వరకు చేరుకుంది. పెళ్లి తంతు నడుస్తున్న సమయంలో వధువు తలపై జుట్టు తక్కువగా ఉండడాన్ని వరుడు గమనించాడు. దీంతో ఈ పెళ్లి తనకు వద్దంటూ నిరాకరించాడు. వరుడు తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయానికి ఇరు కుటుంబాలు షాక్ అయ్యాయి. ఇద్దరు మధ్య వివాదం తలెత్తింది. ఈ మేరకు ఇద్దరూ పెద్దలను ఆశ్రయించారు. రాత్రంతా పంచాయతీ జరిపించినా.. పెళ్ళికొడుకు మాత్రం.. జుట్టు తక్కువగా ఉన్న వధువును పెళ్లి చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని చెప్పేశాడు.
దానికి నా భార్య ఒప్పుకోలేదు.. అందుకే హత్య చేశాను.. పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించిన భర్త..
ఇక లాభం లేదని ఇరు వర్గాలకు చెందినవారు పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అదనపు కట్నం కోసమే వరుడి కుటుంబం నిరాకరిస్తుందని.. వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడు, అతడి తండ్రి సహా మరో తొమ్మిది మంది బంధువుల మీద కేసులు పెట్టారు.