ఆ యువతులు అంతా ఓ హాస్టల్ లోని రూమ్ మేట్స్. అందులో ఓ యువతికి ప్రియుడు ఉన్నాడు. అతడు ఆమె ద్వారా లేడీస్ బాత్ రూమ్ లో వెబ్ కెమెరా పెట్టించి, అభ్యంతరకర వీడియోలను రికార్డు చేసేవాడు. ఓ యువతి దానిని గమనించి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
webcam in ladies bathroom : ప్రియుడి కోసం ఓ ప్రియురాలు దారుణానికి ఒడిగట్టింది. అతడి కోరికను కాదనలేక ఆమె లేడీస్ బాత్ రూమ్ లో వెబ్ కెమెరా బిగించింది. ఆ కెమెరా ద్వారా ప్రియుడు అభ్యంతరకర వీడియోలను రికార్డు చేసేవాడు. అయితే ఓ యువతి దానిని గమనించి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Cyclone Michaung : ముంచుకొస్తున్న మైచౌంగ్ తుఫాన్.. ఎప్పుడు ? ఎక్కడ ? అది తీరం దాటనుందంటే..
వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్ గడ్, హర్యానాల ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్ లో ఓ పేయింగ్ గెస్ట్ లేడీస్ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ కు ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ కు చెందిన ఓ యువతి వచ్చింది. ఆమె ఐఈఎల్ టీఎస్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు చండీగఢ్ కు చేరుకుంది. ఆమె ఉన్న రూమ్ లో మొత్తంగా నలుగురు యువతులు ఉండేవారు. వారందరికీ కామన్ గా ఒకే బాత్ రూమ్ ఉండేది.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు వచ్చిన యువతి ఇటీవల బాత్ రూమ్ లోని గీజర పైన కెమెరా లాంటి నల్లటి ఓ పరికరాన్ని గమనించింది. ఆమెకు అనుమానం వచ్చి వెంటనే ఈ విషయాన్ని ఆ హాస్టల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చింది. ఆయన పోలీసులను పిలిపించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. బాత్ రూమ్ లో ఉన్నది వెబ్ కెమెరా అని పోలీసులు నిర్ధారించారు.
Mother Dead Body : తల్లి శవంతో ఏడాదిగా ఒకే ఇంట్లో అక్కా చెల్లెళ్లు.. ఎందుకంటే ?
దర్యాప్తులో ఆ నలుగురు రూమ్ మేట్స్ లోని ఓ యువతే ఈ వెబ్ కెమెరాను బిగించిందని వారు కనుగొన్నారు. వెంటనే ఆమెను అరెస్టు చేశారు. ప్రియుడి సూచనల మేరకే తాను అలా చేశానని, 'ది కేరళ స్టోరీ' సినిమా నుంచి బాత్ రూమ్ లో కెమెరాను ఇన్ స్టాల్ చేయాలనే ఆలోచన వచ్చిందని నిందితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది.
Cyclone Michaung : ముంచుకొస్తున్న మైచౌంగ్ తుఫాన్.. ఎప్పుడు ? ఎక్కడ ? అది తీరం దాటనుందంటే..
ఆ యువతిని, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అయితే ఆ వెబ్ కెమెరాలో గానీ, నిందితుల మొబైల్ ఫోన్లలో కానీ ఎలాంటి వీడియోలు లభించలేదని పోలీసులు తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 354 సీ(అశ్లీలత), 509(మహిళ గౌరవానికి భంగం కలిగించడం), ఐటీ చట్టంలోని సెక్షన్ 66 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.