ఒడిశా రాష్ట్రంలోని ఘటగావ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
న్యూఢిల్లీ: ఒడిశా రాష్ట్రంలోని ఘటగావ్ వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 12 మంది గాయపడ్డారు.
ఒడిశాలోని కెందుజార్ వద్ద శుక్రవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది మృతి చెందారు. ఒడిశాలోని కియోంఝర్ వద్ద జాతీయ రహదారి 20పై ఈ ప్రమాదం జరిగింది. ఘటగాన్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి కూడ ఉన్నారని అధికారులు తెలిపారు. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు ప్రకటించారు.దేవాలయ దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఐదుగురు కియోంజర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కటక్ లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.
గంజాం జిల్లాలోని పుడమరి గ్రామానికి చెందిన 20 మంది త్రారిణిదేవి దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జూన్ లో ఇదే తరహా ప్రమాదం గంజాం జిల్లాలో జరిగింది. జిల్లాలోని రెండు బస్సుల ఢీకొనడంతో కనీసం 12 మంది మృతి చెందారు.ఈ ప్రమాదంలో మృతులకు సీఎం నవీన్ పట్నాయక్ రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.