Southwest Monsoon Rains: ఈ సారి వానలు దంచి కొట్టుడే..

Published : Jun 01, 2022, 11:02 AM IST
Southwest Monsoon Rains: ఈ సారి వానలు దంచి కొట్టుడే..

సారాంశం

Southwest Monsoon Rains: భార‌త దేశంలో  నైరుతి రుతుపనాలు చాలా చురుక‌గా క‌దులుతున్నాయ‌ని ఉన్నాయని, ఇప్ప‌టికే నైరుతి రుతుపవనాలు కేరళను చుట్టేసి.. మధ్య అరేబియా సముద్రం సహా కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో విస్త‌రించ‌బోతున్న‌ట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సారి ఆశించిన స్థాయి కంటే.. ఎక్కువ వ‌ర్ష‌పాతం న‌మోదు అయ్యే అవ‌కాశ‌ముంద‌ని ఐఎండీ తెలిపింది.   

Southwest Monsoon  Rains: భారత వాతావరణ శాఖ మ‌రో చల్లని క‌బురు చెప్పింది. గ‌తంలో కంటే.. ఈ సారి అధిక వ‌ర్ష‌పాతం న‌మోదవుతుంద‌ని, గతంలో ప్ర‌క‌టించిన‌ వర్షపాత అంచనాలు సవరిస్తూ.. కీలక ప్రకటన చేసింది. దేశంలోని  ప‌లు ప్రాంతాల్లో తగినంతగా వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది. మధ్య, ద్వీపకల్ప భారతదేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతంలో 103% ఆశించవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది.. అంచనాలు మించి భారీ వర్షాలు ప‌డే అవ‌కాశముంద‌ని భాత‌ర వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తుంది.  

గ‌తంలో దీర్ఘకాల సగటులో 99 శాతం వర్షపాతం న‌మోద‌వుతుండ‌ని ప్రకటించిన భారత‌  వాతావరణ శాఖ ఆ ప్రకటనను సవరించింది. ప్ర‌స్తుతం అంచనాల ప్ర‌కారం..  గతంలో కంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశ‌ముంద‌నీ, దీర్ఘకాల సగటు కంటే.. 103 శాతం అధిక వ‌ర్ష‌పాత న‌మోదవుతుంద‌ని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని  ప‌లు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడబోతున్నాయ‌నీ, అయితే ఈశాన్య ప్రాంతంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అభిప్రాయ పడింది.

 
కేర‌ళ‌లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నిర్ణీత షెడ్యూల్ కంటే మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ 1వ తేదీ నాటికి Southwest monsoon దేశంలోప్రవేశిస్తాయని తొలుత భావించిన‌ప్ప‌టికీ.. మూడు రోజుల ముందుగానే కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించినట్టుగా భారత వాతావరణ శాఖ  ప్ర‌కటించింది. ఈ నెల 14న IMD అంచనాల మేరకు ఈ నెల 27నే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది. 

భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర ఈ విషయాన్ని ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ప్రభావంతో మే 27వ తేదీన కేరళకు చేరుకునే అవకాశం ఉందని ఓ దశలో ఐఎండీ అంచనా వేసింది. అయితే వాతావరణంలో మార్పులతో కేరళలో రుతుపవనాల ప్రవేశం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 27న రుతు పవనాలు కేరళలో ప్రవేశించడానికి  పరిస్థితులు మరింత మెరుగు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది.  

ప్రస్తుతానికి రుతుపనాలు చాలా చురుక‌గా క‌దులుతున్నయ‌ని, ఇప్ప‌టికే కేరళను పూర్తిగా చుట్టేసి.. మధ్య అరేబియా సముద్రం,  కర్నాటక, తమిళనాడుల్లో విస్తరించినట్టు ప్రకటించింది.ఆ త‌రువాత   బంగాళాఖాతం ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయని ప్రకటించింది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?