అవసరమైతే సోనాలి ఫోగట్ మృతి కేసును సీబీఐకి అప్పగిస్తాం - గోవా సీఎం ప్రమోద్ సావంత్

By team teluguFirst Published Aug 28, 2022, 2:37 PM IST
Highlights

సోనాలి ఫోగట్ మృతి కేసును అవసరం అయితే సీబీఐకి అప్పగిస్తామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ కేసులో విచారణకు గోవా ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పారు. 

సోనాలి ఫోగట్ మృతి కేసును అవ‌స‌రం అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ‘‘ హర్యానా సీఎం ఖట్టర్ నాతో మాట్లాడారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయాలని అభ్యర్థించారు. కుటుంబ సభ్యుల‌ను ఆయ‌న‌ను వ్యక్తిగతంగా కలుసుకుని అభ్యర్థించడంతో కేసును సీబీఐ స్వాధీనం చేసుకోవాలని ఖట్ట‌ర్ కోరుతున్నారు" అని అన్నారు.

వారి పోరాట స్ఫూర్తికి వంద‌నం.. స్మృతి వన్ మెమోరియల్ ప్రారంభించిన ప్ర‌ధాని

దీనికి తాను స‌మ్మ‌తం తెలిపాన‌ని అన్నారు. విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, దర్యాప్తుకు తన మద్దతును ఇస్తాన‌ని అన్నారు.‘‘నాకు దానితో సమస్య లేదు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయిన అవసరమైతే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తాను ’’ అని ఆయన అన్నారు. బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్య కేసుతో విచారణకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని, ఇందులో ప్రమేయమున్న వారిని గోవా పోలీసులు శిక్షిస్తారని ప్రమోద్ సావంత్ చెప్పారు. 

నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయ‌న చెప్పారు. నిందితులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గోవా పోలీసులు మొదటి రోజు నుంచి విచారణకు పూర్తి మద్దతు ఇస్తున్నారని, ఇందులో పాల్గొన్న వారిని విడిచిపెట్టబోమని ఆయన అన్నారు.

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ను కలిసి చూస్తే రూ. 5000 జరిమానా.. పోస్టులూ చేయొద్దు: శ్రీనగర్ కాలేజీ ఆర్డర్

కాగా... అంతకు ముందు రోజు మరో డ్రగ్ పెడ్లర్ రామ మాండ్రేకర్ ను అంజునా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇది ఐదవ అరెస్టు. బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్య కేసులో గోవా పోలీసులు శనివారం మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జివ్బా దాల్వీ తెలిపారు. అరెస్టయిన ఇద్దరిని అంజునాలోని కర్లీస్ బీచ్ షాక్ యజమాని డ్విన్ నూన్స్, అనుమానిత డ్రగ్ పెడ్లర్ దత్‌ప్రసాద్ గాంకర్‌గా గుర్తించారు.

స్వాతంత్య్ర దినోత్స‌వం నాడు దేశం స‌మిష్టి శ‌క్తిని చూశాం - మ‌న్ కీ బాత్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

అంజునాలోని హోటల్ గ్రాండ్ లియోనీ రిసార్గ్ లో రూమ్ బాయ్ గా పనిచేస్తున్న దత్తప్రసాద్ గాంకర్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కాగా.. మరణించిన బీజేపీ నాయ‌కురాలు సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను శనివారం చండీగఢ్ లోని ఆయన నివాసంలో కలిశారు.
 

click me!