జీ 20 నేతలతో ప్రపంచ సమస్యలపై చర్చిస్తాం - ప్రధాని నరేంద్ర మోడీ..

Published : Nov 14, 2022, 01:53 PM IST
జీ 20 నేతలతో ప్రపంచ సమస్యలపై చర్చిస్తాం - ప్రధాని నరేంద్ర మోడీ..

సారాంశం

మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా రాజధాని బాలికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జీ 20 సదస్సులో కూడా పాల్గొంటారు. ఈ సదస్సుల్లో ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరుపుతానని ప్రధాని మోడీ తెలిపారు. 

ప్రపంచ అభివృద్ధి, ఆహారం, ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి సమస్యల పరిష్కారానికి బాలిలో జీ 20 సభ్య దేశాల నాయకులతో విస్తృత చర్చలు జరుపుతామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.  భారతదేశం సాధించిన విజయాలను, ప్రపంచ సవాళ్లకు సమిష్టి పరిష్కారాలను కనుగొనడంలో ‘‘అచంచలమైన నిబద్ధత’’ను కూడా నొక్కి చెబుతానని పేర్కొన్నారు.

కేయూఎఫ్‌వోఎస్ వైస్ ఛాన్సలర్ నియామకాన్ని రద్దు చేసిన కేరళ హైకోర్టు.. వివరాలు ఇవే..

జీ 20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ఇండోనేషియా రాజధాని బాలికి బయలుదేరే ముందు ప్రధాని సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ దేశంలో మోడీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఈ సదస్సులో పాల్గొంటారు.

ప్రధాని మోడీ విడుదల చేసిన ప్రకటనలో ‘‘జీ 20 సదస్సు సందర్భంగా సదస్సులో పాల్గొనే పలువురు ప్రపంచ నేతలను నేను కలుస్తాను. వారితో భారతదేశం ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షిస్తాను ’’ అని పేర్కొన్నారు. వచ్చే నెలలో భారత్ జీ20  ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంపై ప్రధాని ప్రస్తావిస్తూ.. ‘‘బాలీ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో జీ 20 అధ్యక్ష పదవిని భారతదేశానికి అప్పగిస్తారు. ఇది మన దేశానికి ఒక ముఖ్యమైన క్షణం.’’ అని తెలిపారు.

ఎద్దులబండ్ల పోటీలో చేలారేగిన వివాదం.. ఇరువర్గాల మధ్య విచక్షణారహితంగా కాల్పులు ..

డిసెంబర్ 1, 2022 నుంచి జీ20 అధ్యక్ష పదవిని భారత్ అధికారికంగా చేపడుతుందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా సభ్యులందరికీ వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపుతాను. ‘వసుధైవ కుటుంబం’ లేదా ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే థీమ్‌పై భారతదేశం జీ 20 అధ్యక్ష పదవి స్వీకరిస్తుందని తెలిపారు. కాగా.. ఇండోనేషియా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సదస్సుకు ప్రస్తుతం ఇండోనేషియా అధ్యక్ష బాధ్యతలు కొనసాగిస్తోంది.

రాజస్థాన్ లో ఫారెస్ట్ గార్డ్ ఎగ్జామ్ పేపర్ లీక్.. ఇద్దరిని అరెస్టు చేసిన అధికారులు..

ఈ జీ20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్, యూరోపియన్ యూనియన్ లు భాగంగా ఉన్నాయి. జీ 20 ప్రపంచ ఆర్థిక సహకారానికి ఒక ప్రభావవంతమైన కూటమిగా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతానికి పైగా, అలాగే ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాగా.. ప్రస్తుత సమావేశంలో ఉక్రెయిన్ ఘర్షణ ప్రభావంతో పాటు ఆహారం, ఇంధన భద్రత రంగాలలో ప్రపంచ సవాళ్లను చర్చించే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం