ఇండో-మయన్మార్-భూటాన్ రైలు లైన్ సర్వే పూర్తి.. రెండున్నరేండ్లలో అందుబాటులోకి..    

Published : Nov 14, 2022, 01:47 PM IST
ఇండో-మయన్మార్-భూటాన్ రైలు లైన్ సర్వే పూర్తి.. రెండున్నరేండ్లలో అందుబాటులోకి..    

సారాంశం

భారతదేశం-మయన్మార్-భూటాన్ రైలు లింక్ సర్వే పూర్తందని ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే జీఎం అన్షుల్ గుప్తా తెలిపారు. అలాగే.. రైల్వే నూతన ప్రాజెక్టుల గురించి పలు సమాచారం అందించారు

భారతీయ రైల్వే తన రైల్వే నెట్‌వర్క్‌ను పొరుగు దేశాలతో వేగంగా విస్తరిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తర్వాత, భూటాన్, మయన్మార్‌లకు రైలు సేవలను వేగవంతంగా అనుసంధానం చేసే పనిలో పడింది. వీటన్నింటి మధ్య,ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా ఇండియన్ రైల్వే చేపట్టనున్న నూతన ప్రాజెక్టుల గురించి మీడియాకు తెలిపారు. భారతదేశం-మయన్మార్-భూటాన్ రైలు లింక్ గురించి పలు వివరాలను తెలిపారు.

ఇప్పటికే భారత్-మయన్మార్ రైలు అనుసంధానంపై సర్వే పూర్తయిందని,మణిపూర్‌లోని మోరే వరకు మయన్మార్ రైలు కనెక్టివిటీ జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే ప్రాజెక్ట్ పని ప్రారంభమవుతుందని, ఈ ప్రాజెక్టు 2 నుంచి 2.5సంవత్సరాలలో పూర్తవుతుందని తెలిపారు. 

నేపాల్ రైలు కనెక్టివిటీ

మరోవైపు..ఈశాన్య సరిహద్దు రైల్వే GM అన్షుల్ గుప్తా కూడా నేపాల్ రైలు కనెక్టివిటీ గురించి నూతన సమాచారాన్ని అందించారు. బిరత్‌నగర్‌ వరకు రైలును అనుసంధానం చేసేందుకు పనులు కొనసాగుతున్నాయని, మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇది కాకుండా నేపాల్ కస్టమ్ యార్డ్ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. 

భూటాన్‌కు రైలు సర్వీస్

భూటాన్‌తో కనెక్టివిటీ విషయానికొస్తే.. మొదటి రైలు లింక్ కోసం సర్వే ప్రారంభించినట్లు అన్షుల్ గుప్తా చెప్పారు. మార్చి నాటికి ఇది పూర్తవుతుందనీ, కోక్రాజార్ (అస్సాం) నుండి గెలెఫు (భూటాన్)వరకు ఈ రైల్వే లైన్ కనెక్ట్ చేయబడి  ఉంటుందనీ,  ప్రాజెక్ట్ ఆమోదం పొందిన వెంటనే 2-2.5 సంవత్సరాలలో పని పూర్తవుతుందని భావిస్తున్నామని తెలిపారు.

ఆ రెండు రైలు మార్గాలు మార్చి 2023 నాటికి పూర్తి 

తాము ఇప్పటికే బంగ్లాదేశ్ కోసం కొత్త జల్పైగురి మిథాలీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించామని ఆయన చెప్పారు. ఇది హల్దీబారి (WB)కి అనుసంధానించబడిందనీ, ఇవి కరీంగంజ్ (అస్సాం) నుండి షాబాజ్‌పూర్ (బడేష్), అగర్తల (త్రిపుర) నుండి నిశ్చింతపూర్ (పశ్చిమ బెంగాల్) మీదుగా అఖౌరా (బాదేశ్) వరకు వెళ్తాయని, రెండు రైలు మార్గాలు మార్చి 2023 నాటికి పూర్తవుతాయని GM అన్షుల్ గుప్తా తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం