ఓటు వేయడం తప్పనిసరి చేయాలి: గుజరాత్‌లో ఓటేశాక యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Dec 6, 2022, 3:12 PM IST
Highlights

ఓటు వేయడం తప్పనిసరి చేయాలని గుజరాత్ మాజీ సీఎం, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అన్నారు. దేశాభివృద్ధికి ఓటు కీలకం అని తెలిపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయడం తప్పనిసరి చేయాలని అన్నారు. ఓటు వేయడం దేశ అభివృద్ధికి, ఉన్నతికి తోడ్పడుతుందని వివరించారు. ఆమె సోమవారం అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. గుజరాత్‌ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పని చేస్తున్నారు.

గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలో ఆమె అహ్మదాబాద్‌లోని శిలాజ్ ఏరియాలో ఓటేశారు. అనంతరం, ఆమె మాట్లాడుతూ, ప్రతి ఓటరు తప్పకుండా ఓటు వేసే హక్కును వినియోగించుకోవాలని ఆమె అన్నారు. దేశం కోసం ఓటు వేయడం అత్యవసరం, ముఖ్యం అని కూడా వివరించారు. ఈ కారణంగానే ఓటు వేయడం తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. ఇది దేశం విజయవంతం చేస్తుందని చెప్పారు.

Also Read: ప్రైవేట్ జాబ్ చేస్తేనే గవర్నమెంట్ ఉద్యోగం... గోవా సర్కార్ కొత్త రూల్

ఓటు వేయడం అనేది ప్రతి ఓటరు హక్కు అని, దాన్ని కచ్చితంగా అందరూ వినియోగించుకోవాలని అన్నారు. దేశాన్ని ది బెస్ట్ చేయడానికి ఓటర్లు దీన్ని ఉపయోగించుకోవాలని వివరించారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు శాతం తగ్గిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం క్రమంగా క్షీణిస్తూ వస్తున్నది.

click me!