‘భక్తి ఎక్కువైనా ప్రమాదకరమే’.. గుడిలోని ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోయిన భక్తుడు.. వైరల్ వీడియో ఇదే

By Mahesh KFirst Published Dec 6, 2022, 2:27 PM IST
Highlights

ఓ భక్తుడు గుడిలోని ఏనుగు కాళ్ల మధ్య నుంచి అంటే ఉదరం కింద నుంచి ఇటు వైపు ఈగాలని అనుకున్నాడేమో.. కానీ, ఆ వ్యక్తి అందులో ఇరుక్కుపోయాడు. బయటకు రావడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతున్నది. గుడిలోని ఓ ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య చిక్కుకున్న భక్తుడి వీడియో అది. అతడు ఏనుగు కాళ్ల మధ్య నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ, రాలేకపోతున్నాడు. ఆయనకు సహాయం చేయడానికి ఇతర భక్తులు, ఆలయ పురోహితుడు కూడా అక్కడికి వచ్చినట్టు ఆ వీడియో ద్వారా తెలుస్తున్నది. కానీ, వారంతా కేవలం ఆయనకు సూచనలు చేయడం మినహా మరేమీ చేయలేని దుస్థితిలో ఉండిపోయారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను నితిన్ అనే యూజర్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోను సుమారు లక్ష మంది వీక్షించారు.

ఈ వీడియో ఎవరు తీసింది? ఆ గుడి ఎక్కడిది? అనే వివరాలేవీ తెలియరాలేదు. ఆ వ్యక్తి ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య నుంచి బయటకు సేఫ్‌గా వచ్చాడా? లేదా? అనే విషయంపైనా స్పష్టత లేదు. అసలు ఆ వ్యక్తి ఏనుగు విగ్రహం మధ్యలో ఎలా చిక్కుకున్నాడో కూడా తెలియరాలేదు.

Also Read: నడి వీధిలో.... వింత తోడేలు... వీడియో వైరల్..!

ఆ వ్యక్తి అందులో నుంచి బయటకు రావడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కొందరు ఏనుగు కాళ్లను ఊతంగా పట్టుకుని నెట్టుతూ ముందుకు అంటే బయటకు వచ్చేయాలని సూచించారు. మరికొందరు నడుమును తిప్పుతూ వదులు చేస్తూ బయటకు వచ్చే ప్రయత్నం చేయాలని చెప్పారు. అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఆ భక్తుడు మాత్రం అక్కడ నానా తంటాలు పడ్డాడు.

Any kind of excessive bhakti is injurious to health 😮 pic.twitter.com/mqQ7IQwcij

— ηᎥ†Ꭵղ (@nkk_123)

ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చి పడ్డాయి. ఈ వీడియో పోస్టు చేసిన నితిన్ అనే ట్విట్టర్ యూజర్ ఏ రకం భక్తి అయినా ఎక్కువైతే ప్రమాదకరమే అని వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. అసలు ఆ వ్యక్తి అందులో ఎలా ఇరికాడు అని కొందరు ఆరా తీస్తే.. ఆయన సురక్షితంగా బయటకు రావాలని కాంక్షించారు. ఒక వేళ ఆయన అందులో నుంచి బయటకు రాలేకపోతే ఏం చేస్తారు? ఇదొక సీరియస్ కొశ్చన్ అని మరో యూజర్ ట్వీట్ చేశాడు.

click me!