ఢిల్లీ దారుణం: కారు కింద మహిళ చిక్కుకున్నదని తెలుసు.. ఎందుకు ఆపలేదంటే..: పోలీసులతో నిందితుడు

By Mahesh KFirst Published Jan 8, 2023, 3:28 PM IST
Highlights

ఢిల్లీలో కొన్ని కిలోమీటర్ల మేరకు ఈడ్చుకెళ్లడంతో మరణించిన మహిళకు సంబంధించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కారు కింద బాడీ ఉన్నదనే విషయం తమకు తెలియదని నిందితులు వాదించిన సంగతి తెలిసిందే. కానీ, తాజాగా అది అవాస్తవం అని, తమకు బాడీ ఉన్నదనే విషయం తెలుసు అని, కానీ, మర్డర్ కేసు అవుతుందని భయపడే అలాగే కారును తిప్పామని వివరించినట్టు పోలీసులు వివరించారు.
 

న్యూఢిల్లీ: నూతన సంవత్సరం రోజునే ఢిల్లీలో ఓ ఘోరం జరిగిన సంగతి తెలిసిందే. ఓ కారు స్కూటీని ఢీకొట్టడంతో స్కూటీ నడుపుతున్న మహిళ ఆ కారు కింద పడింది. ఆమెను అలాగే కొన్ని కిలోమీటర్ల మేరకు ఆ కారు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ దారుణ స్థితిలో విగత జీవై కనిపించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు అదే రోజునే ఆ కారులో నుంచి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కారు చక్రాల కింద ఒక మహిళ చిక్కుకున్నదని తమకు తెలియదని వారు అప్పుడు పోలీసులకు తెలిపారు. కానీ, తాజా దర్యాప్తులో ఇది అబద్ధం అని తేలింది.

ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఈ ఘటన జరిగింది. స్కూటీని ఢీకొట్టిన మాట వాస్తవమే కానీ, ఆ మహిళ (అంజలి) కారు కింద చిక్కుకుందని తమకు తెలియదని వారు అప్పుడు పోలీసులకు తెలిపారు. కారులోనూ సౌండ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కూడా తాము అది గమనించలేదని వారు చెప్పారు. కానీ, తాజాగా పోలీసులకు ఓ నిందితుడు ఇందుకు భిన్నమైన విషయాన్ని వివరించాడు.

కారు కింద ఆ మహిళ చిక్కుకున్నదనే విషయం నిందితులకు తెలుసు అని, కానీ, కారు ఆపి ఆమెను రక్షించడానికి వెళ్లితే తమ పై మర్డర్ కేసు ఫైల్ అవుతుందని భయపడ్డారని పోలీసులు చెప్పారు. ఆ కారు నడిపిన వారు అప్పుడు భయపడ్డారని, ఆమె బాడీ పడిపోయేదాకా అలాగే తిరిగారని వివరించారు. 

Also Read: కారు కింద నా ఫ్రెండ్ ఇరుక్కుపోయిందని వారికి తెలుసు.. ఉద్దేశపూర్వకంగానే కారు నడిపారు - అంజలి సింగ్ స్నేహితురాలు

తమకు అసలు బాడీ ఉన్నదనే విషయం తెలియదని గతంలో వారు వాదించారు. ఇప్పుడు ఆ వాదన మొత్తం కూడా తప్పు అని తాజాగా కన్ఫెస్ అయ్యారు.

అంజలి శవపరీక్ష నివేదికలో భయానక విషయాలు వెలుగు చూశాయి. ఆమె శరీరంపై బాహ్యంగా అనేక గాయాలు అయ్యాయని శవపరీక్ష వెల్లడించింది. నివేదిక ప్రకారం.. అంజలిని కారుతో పాటు ఈడ్చుకుంటూ వెళ్లడం వల్ల చర్మం ఒల్చినట్లు అయింది. పక్కటెముకలు బయటపడ్డాయి.  ఆమె ఊపిరితిత్తులు బయటకు వచ్చాయి. రెండు కాళ్లు విరిగిపోవడంతో పాటు.. పుర్రె ఛిద్రమైంది. మెదడులోని కొంత భాగం కనిపించలేదు.

ప్రమాదంలో అంజలి తల, వెన్నెముక, కింది అవయవాలపై గాయాలయ్యాయని నివేదిక వెల్లడించింది. ఆమె మరణానికి కారణం షాక్, రక్తస్రావం అని జాబితా చేయబడింది. తీవ్రమైన గాయాలు సమిష్టిగా ఆమె మరణానికి కారణమై ఉండవచ్చని నివేదిక పేర్కొంది. ఇక, శవపరీక్ష నివేదిక ప్రకారం.. అంజలికి లైంగిక వేధింపులకు గురిచేసే ఎలాంటి గాయం కాలేదు.

ఇక, ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేసే అంజలిడిసెంబర్ 31 సాయంత్రం న్యూ ఇయర్ ఈవ్ పార్టీకి హాజరయ్యేందుకు అమన్ విహార్‌లోని తన ఇంటి నుండి బయలుదేరింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో అంజలి ఇంటికి ఆలస్యంగా వస్తానని కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. జనవరి 1, ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు, బూడిద గ్రే కలర్ బాలెనో కారు మృతదేహాన్ని లాగుతున్నట్లు పోలీసులకు కాల్ వచ్చింది. జోంటి గ్రామం హనుమాన్ మందిర్ సమీపంలో పోలీసులు తెల్లవారుజామున 4.11 గంటలకు మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై పెద్దఎత్తున గాయాలు ఉన్నాయి, బట్టలు చిరిగిపోయాయి. ఆమె రెండు కాళ్ళు శరీరం నుండి వేరు చేయబడ్డాయి.

click me!