
Uniform Civil Code: కర్నాటకలోని విద్యాసంస్థలో రాజుకున్న హిజాబ్ వివాదం (Karnataka hijab row) దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నది. ఈ క్రమంలోనే ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) మళ్లీ తెరమీదకు వచ్చింది. బీజేపీ నాయకులు ఉమ్మడి పౌరస్మృతిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐదు రాష్ట్రాలు జరుగుతున్న సందర్భంగా ఈ అంశం తెరమీదకు రావడం మరింతగా రాజకీయ దుమారం రేపుతున్నది. తాము అధికారంలోకి వస్తే.. ఉమ్మడి పౌరస్మృతిని తీసుకువస్తామని బీజేపీ (Bharatiya Janata Party) నేతలు (political leaders) ప్రకటనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే change.org వెబ్ సైట్ లో సాఫ్రాన్ థింక్ ట్యాంక్ (Saffron Think Tank) ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు తెలుపుతూ..ఆన్‌లైన్ పిటిషన్ (petition) నిర్వహిస్తోంది. ఇందులో ఇప్పటివరకు 1.28 లక్షల మంది మద్దతు తెలుపుతూ.. పిటిషన్‌పై సంతకం చేశారు. సాఫ్రాన్ థింక్ ట్యాంక్ (Saffron Think Tank) ఉమ్మడి పౌరస్మృతి గురించి ఈ విధంగా పేర్కొంది... భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (Uniform Civil Code) అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. యూనిఫాం సివిల్ కోడ్ అనేది వివిధ విశ్వాసాల వ్యక్తులకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలను అనుమతించే బదులు, భారతీయులందరికీ వివాహం, విడాకులు, వారసత్వం, దత్తతలను నియంత్రించే సాధారణ చట్టాలను కలిగి ఉంటుంది అని పేర్కొంది.
అలాగే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 యూనిఫాం సివిల్ కోడ్ (Uniform Civil Code)ను కేంద్ర ప్రభుత్వ విధాన నిర్దేశక సూత్రాలలో ఒకటిగా జాబితా చేస్తుంది. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు సాఫ్రాన్ థింక్ ట్యాంక్ (Saffron Think Tank) మద్దతు ఇస్తుంది. యూనిఫాం సివిల్ కోడ్‌ను వీలైనంత త్వరగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి (central government) విజ్ఞప్తి చేస్తున్నాం! "ఆర్టికల్ 44 కింద ఊహించిన విధంగా యూనిఫాం సివిల్ కోడ్ ఆవశ్యకతను సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు పునరుద్ఘాటిస్తుంది" అని తెలిపింది. సమాజంలో కుల, మత సంబంధిత అడ్డంకులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. "వివిధ సంఘాలు (various communities), తెగలు (tribes), కులాలు (castes) లేదా మతాల (religions)కు చెందిన భారతీయ యువత తమ వివాహాలను జరుపుకునే వారు వివిధ వ్యక్తిగత చట్టాలలో, ముఖ్యంగా వివాహం, విడాకులకు సంబంధించిన వైరుధ్యాల కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలతో పోరాడటానికి బలవంతం చేయకూడదు" అని తెలిపింది.
అందరికీ ఉమ్మడి సివిల్ కోడ్ (Uniform Civil Code) ను ఏర్పాటు చేయడానికి, చట్టం తీసుకురావడానికి పార్లమెంట్ చర్యలు ప్రారంభించడానికి ఈ పిటిషన్‌కు మద్దతుదారులతో పాటు సాఫ్రాన్ థింక్ ట్యాంక్ ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో పౌరులందరికీ ఉమ్మడి సివిల్ కోడ్ వైపు క్రమంగా.. ఏకాభిప్రాయంతో వెళ్లడం రాజ్యాంగ నిర్మాతల లక్ష్యం అని పేర్కొంది. దేశం శ్రేయస్సు కోసం ఈ పిటిషన్‌పై సంతకం చేయవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. పిటిషన్‌పై సంతకం చేసి, మా చొరవకు మద్దతు ఇవ్వమని తోటి పౌరులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాము! అని సాఫ్రాన్ థింక్ ట్యాంక్ (Saffron Think Tank) పేర్కొంది.