
Delhi rape: మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. దారుణమైన శిక్షలు విధించిన కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఆడవారు కనిపిస్తే చాలు.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కండ్లు కామంతో మూసుకపోతున్నాయి. దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
అయితే మొన్నటి వరకు ఆడపిల్లలను చూస్తే చాలు..కామంతో కామాంధులు రెచ్చిపోయి అత్యాచారాలకు పాల్పడేవారు. మహిళ ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. కానీ నేటి సభ్యసమాజ తలదించుకునే ఘటన దేశ రాజధాని ఢిల్లీ లో జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 87 ఏండ్ల వృద్దురాలిపై ఓ కామంధుడు రెచ్చిపోయి.. మరి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి
వచ్చింది.
వివారాల్లోకెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలోని తిలక్ నగర్‌లో 87 ఏళ్ల వృద్ధురాలి, తన కుమార్తే( 65)తో కలిసి నివసిస్తోంది. ఆదివారం తన కూతురు మద్యాహ్నాం 12 గంటల పాంత్రంలో మార్కెట్ వెళ్లింది. ఈ సమయంలో గుర్తు తెలియని ఓ కామంధుడు ఇంట్లోకి చోరబడి ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేస్తున్నప్పటికీ నోరు మూసేసి చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో ఆ వృద్ధురాలు స్పృహ కోల్పోయింది. తన కూతురు తిరిగి ఇంటి వచ్చి చూసే సరికి .. తన తల్లి బట్టలు చినిగిపోయి, రక్త స్రావంతో పడిపోయి ఉంది. దీంతో వెంటనే.. తన ఇంటి పక్కవారి సహాయంతో ఆ వృద్ధురాలను సమీపంలోని ఆస్పత్రి తరలించింది.
అనంతరం బాధితురాలి కుమార్తె.. పోలీసులను ఆశ్రయించి.. తొలుత మొబైల్ ఫోన్ చోరీ చేసినట్టు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో వృద్దురాలిపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో తన తల్లి లైంగిక వేధింపులకు గురైందని బాధితురాలి కూతురు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు అదనపు డీసీపీ (పశ్చిమ జిల్లా) ప్రశాంత్ గౌతమ్ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందనీ, బాధితురాలికి కౌన్సెలింగ్‌తోపాటు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.