జిల్లా స్థాయిలో మైనార్టీలని గురించే ఆదేశాలు జారీ చేయలేం: సుప్రీంకోర్టు

Published : Aug 09, 2022, 12:41 PM IST
జిల్లా స్థాయిలో మైనార్టీలని గురించే ఆదేశాలు జారీ చేయలేం: సుప్రీంకోర్టు

సారాంశం

జిల్లా స్థాయిలో మైనార్టీలను గుర్తించడానికి గైడ్‌లైన్స్ జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరుతూ ఓ పిటిషన్ ఫైల్ అయింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. టీఎంఏ పాయ్ కేసును పేర్కొంటూ.. మైనార్టీలను గుర్తించడానికి యూనిట్‌గా రాష్ట్రాన్ని తీసుకుంటామని స్పష్టం చేసింది.  

న్యూఢిల్లీ: జిల్లా స్థాయిలో హిందువులను మైనార్టీలుగా గుర్తించడానికి గైడ్‌లైన్స్ రూపొందించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇది చట్టానికి వ్యతిరేకం అని వివరించింది. ఎందుకంటే.. చట్టం ప్రకారం, మతపరైమన లేదా భాషా ప్రాధికారమైనా మైనార్టీ హోదా ఇవ్వడానికి మినిమ్ యూనిట్ రాష్ట్రమే అని స్పష్టం చేసింది. అంతకంటే చిన్నభూబాగాన్ని అంటే.. జిల్లా స్థాయిలో ఈ హోదాను కల్పించే అవకాశం లేదని వివరించింది.

జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ఆర్ భట్‌ల ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ యాక్ట్ 1992లోని ఓ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. మైనార్టీకి నిర్వచనాన్ని ఇవ్వల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, అలాగే, జిల్లా స్థాయిలోనూ మైనార్టీలను గుర్తించడానికి గైడ్‌లైన్స్ ఇవ్వాలని ఆ పిటిషన్ కోరుతున్నది.

టీఎంఏ పాయ్ జడ్జిమెంట్ 2002ను సుప్రీంకోర్టు ఉల్లేఖిస్తూ.. ఈ పిటిషన్ చట్టవిరుద్దంగా ఉన్నదని తోసిపుచ్చింది. టీఎంఏ పాయ్ కేసులో మతం ఆధారంగానైనా లేదా భాష ఆధారంగానైనా సరే మైనార్టీలను గుర్తించడానికి ప్రమాణంగా రాష్ట్రాన్ని తీసుకుంటున్నారని స్పష్టంగా ఉన్నదని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం 1993 అక్టోబర్ 23న మైనార్టీ కమ్యూనిటీలను డిక్లేర్ చేయడానికి జారీ చేసిన నోటిఫికేషన్‌ను అహేతుకంగా, అవాస్తవంగా పేర్కొనాలని అడ్వకేట్ అశుతోశ్ దూబే ద్వారా ఈ పిటిషన్ దాఖలైంది. అంతేకాదు, ఆ నోటిఫికేషన్ ఆర్టికల్ 14, 15, 21, 29, 30లను ఉల్లంఘిస్తున్నట్టనూ ఆ పిటిషన్ పేర్కొంది.

అంతేకాదు, దేశంలోని పది రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారని, ఆ రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీలుగా గుర్తించాలని పేర్కొంటూ ఓ పిటిషన్ దాఖలైందని, ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని మరో బెంచ్ ముందు విచారణలో ఉన్నదని యూయూ లలిత్ ధర్మాసనానికి తెలిపారు. అనంతరం, దూబే ద్వారా దాఖలైన పిటిషణ్‌ను తోసిపుచ్చింది.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం