మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ : శివసేన 9, బీజేపీ 9... ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు.. వివరాలివే...

Published : Aug 09, 2022, 12:33 PM IST
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ : శివసేన 9, బీజేపీ 9... ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు.. వివరాలివే...

సారాంశం

నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మారిన శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ మేరకు 18 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం ఈ రోజు జరిగింది. 

ముంబై : ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన మంత్రి వర్గ విస్తరణ పూర్తి అయ్యింది. 18 మందితో మహారాష్ట్ర క్యాబినెట్ కొలువుదీరింది. మంత్రివర్గంలో బీజేపీ నుంచి తొమ్మిది,  షిండే వర్గం నుంచి తొమ్మిది మందికి చోటు లభించింది. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ భగత్‌ సింగ్‌ కోష్యారీ 18 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.

 ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం
 చంద్రకాంత్ పాటిల్
 సుధీర్ మునగంటివార్
 గిరీష్ మహాజన్
 సురేష్ ఖడే
 రాధాకృష్ణ విఖే పాటిల్
 రవీంద్ర చవాన్
 మంగళ్ ప్రభాత్  లోధా
 విజయ్ కుమార్ గవిత్
 అతుల్ సేన్ లు ఉన్నారు..

 ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం
 దాదా భుసే
 శంభురాజ్ దేశాయ్
 సందీపాన్ భుమారే
 ఉదయ్  సామంత్
తానాజీ సావంత్
అబ్దుల్ సత్తార్
 దీపక్ కేసర్కర్
 గులాబ్ రావ్ పాటిల్
 సంజయ్ రాథోడ్ లు ఉన్నారు

Maharashtra cabinet: 'మహా' మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌.. హోం మంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌!

అయితే, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ కు హోంమంత్రిత్వ శాఖ దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు షిండే, ఫడ్నవీస్‌ ముందుగా కుదుర్చుకున్న 35–65 ఫార్మూలా ప్రకారం.. ప్రస్తుతతం మినీ మంత్రివర్గ విస్తరణ జరిగింది.

కాగా, మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీలో తిరుగుబాటు కారణంగా ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో జూన్ 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర‌ ఫడ్నవీస్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ఇప్పటివరకు ఇద్దరు స‌భ్యుల‌తోనే క్యాబినెట్ కొనసాగింది. దీనిని ఎన్‌సిపి నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు అనేకమంది ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. 

అయితే, విపక్షాల విమర్శలపై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అజిత్ పవార్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారని.. తాను ప్రభుత్వంలో ఉన్న సమయంలో తొలి 32 రోజుల్లో.. ఆయన కేబినెట్ లో ఐదుగురు మంత్రులే ఉన్నారనే విషయం ఆయన మరిచిపోయారన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?