న్యూ ఇండియా అంటే ఏమిటీ?.. యువతతో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆసక్తికర సంభాషణ

By Mahesh KFirst Published Dec 30, 2022, 7:04 PM IST
Highlights

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళలో యువతతో ఆసక్తికర సంభాషణ జరిపారు. న్యూ ఇండియా నేపథ్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన న్యూ ఇండియాతో ప్రపంచ యవనికపై దేశం సాధించిన ప్రతిష్టను వివరించారు. 
 

తిరువనంతపురం: న్యూ ఇండియా అంటే ఏమిటీ? ఓల్డ్ ఇండియా, న్యూ ఇండియాల మధ్య తేడా ఏమిటీ? న్యూ ఇండియాతో వచ్చిన మార్పులు ఏమిటీ? వంటి ఆసక్తికర విషయాలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ యువతకు వివరించి చెప్పారు. కేరళలోని తామరశెరిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ న్యూ ఇయర్ వేడులకు సిద్ధం అవుతున్న తరుణంలో కేంద్ర మంత్రి మన దేశానికి అమృత కాలం గురించిన విషయాలపై చర్చించారు.

2022 ఏడాది ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరం అని ఆయన వివరించారు. ఈ ఏడాది తీపి, చేదు జ్ఞాపకాలను నిలిపి వెళ్లుతున్నదని తెలిపారు. ఈ ఏడాదిలో మనం స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్ల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహించుకున్నామని చెప్పారు. అలాగే, గత రెండేళ్లుగా కరోనా మహమ్మారిని నిలువరించడంలోనూ ఎంతో బాధను ఎదుర్కొన్నామని, విజయం సాధించామని పేర్కొన్నారు. న్యూ ఇండియా పై చర్చలో పాల్గొంటూ ఆయన ముఖ్యమైన విషయాలను యువతతో పంచుకున్నారు.

అనేక యూనివర్సిటీలు, కాలేజీల్లో తాను న్యూ ఇండియా గురించి మాట్లాడానని, ఎంతో సమాచారాన్ని విద్యార్థులకు అందించానని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఒకసారి ఇలాంటి సందర్భంలో న్యూ ఇండియా అంటే ఏమిటీ? అని, దాని అర్థం ఏమిటీ? అని ఒక పిల్లాడు అడిగాడని వివరించారు. దీనికి ఆయనే సమాధానం ఇచ్చారు.

Also Read: విజయ్ దివస్: అమర జవాన్లకు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నివాళి

గత 75 ఏళ్ల నుంచి విదేశాల్లో భారత్‌ను ఎలా వర్ణించేవారు? ఎలాంటి పదాలు ఉపయోగించి మన దేశం గురించి మాట్లాడేవారని అడిగారు. విదేశాల్లో మన దేశానికి ఉన్న గుర్తింపు ఎటువంటిది? అని ప్రశ్నించారు. వీటి గురించి విద్యార్థులైన మీకు తెలియకపోవచ్చని అన్నారు. మీ తల్లిదండ్రులు లేదా.. వారి తల్లిదండ్రులు ఇది తెలిసి ఉండే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. అప్పుడు మీకు తేడా ఏమిటనేది స్పష్టంగా అర్థం అవుతుందని తెలిపారు. ఇప్పుడు మన దేశానికి ఉన్న స్థాయి ఏమిటీ? న్యూ ఇండియాగా ఎలా మారింది? అంతర్జాతీయ వేదికల్లో ఇప్పుడు భారత్ గురించి ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు? ఈ మార్పునే, గత ఎనిమిదేళ్లలో సాధించిన అభివృద్ధినే మనం న్యూ ఇండియాగా భావించవచ్చని తెలిపారు. ఓల్డ్ ఇండియాకు, న్యూ ఇండియాకు ఉన్న ప్రధాన తేడా ఇదే అని వివరించారు.

ఈ అభివృద్ధి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, ఎంటర్‌ప్రెన్యూర్‌లకు అవసరమైన వాతావరణం కల్పించిందని వివరించారు. డిజిటల్ ఎకానమీ ద్వారా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు.

click me!