తన తల్లి మరణించిందని అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకోవద్దని ప్రధాని ఆదేశించారు - రాజ్ నాథ్ సింగ్

Published : Dec 30, 2022, 04:46 PM IST
తన తల్లి మరణించిందని అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకోవద్దని ప్రధాని ఆదేశించారు - రాజ్ నాథ్ సింగ్

సారాంశం

ఈ కష్ట సమయంలోనూ ప్రధాని మోడీ తన కర్తవ్యాన్ని మరువలేదు. యథావిధిగా వర్చువల్ గా తన అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు. అలాగే తన మంత్రి వర్గ సహచరులు కూడా అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకోకూడదని ఆదేశించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 

హీరాబెన్ మోడీ మరణం వల్ల షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన కార్యక్రమాలు ఏవీ వాయిదా పడకూడదని, అధికారిక కార్యక్రమాలేవీ రద్దు చేసుకోకూడదని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి వర్గాన్ని ఆదేశించారని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. శుక్రవారం తిరువనంతపురంలోని వర్కాలలో 90వ శివగిరి తీర్థయాత్రను రక్షణ శాఖ మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మోడీ తల్లి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీకి ఆనంద్ మహీంద్రా ప్రగాఢ సానుభూతి.. హీరాబెన్ ఫొటో ట్వీట్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లి అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను ఎవరూ రద్దు చేసుకోవద్దని ప్రధాని తెలిపారని అన్నారు. ఆ కార్యక్రమాలు ముగిసిపోయిన తరువాతే తిరిగి రావాలని సూచించారని తెలిపారు. ఈ ప్రసంగం తరువాత ఆయన సమావేశంలోనే ఒక నిమిషం మౌనం పాటించారు. హీరాబెన్ మోడీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

హీరాబెన్ మోడీ మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయారు. బుధవారం ఉదయం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా హాస్పిటల్ లో చేరారు. అయితే ఆమె కోలుకుంటోందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని గుజరాత్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కానీ పరిస్థితి విషమించడంతో ఆమె తన 99వ యేట శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. తల్లి మరణం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు.

మారియన్ బయోటెక్ కంపెనీలో ఉత్పత్తిని నిలిపివేశాం - కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా

శుక్రవారం ఉదయం సమయంలో అంత్యక్రియలకు ప్రధాని అంత్యక్రియలకు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా జరపాల్సిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన కొద్ది గంటల్లోనే ప్రధాని మోడీ తన అధికారిక కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా - న్యూ జల్పైగురి మధ్య కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఆయన వర్చువల్ గా  జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ గంగా కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అలాగే మరో రెండు అధికారిక కార్యక్రమాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. 

అయితే పశ్చిమ బెంగాల్ లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మోడీకి పలు సూచనలు చేశారు. ప్రధానికి కొంచెం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ‘‘ మీ అమ్మ మా అమ్మ’’ అని సంబోధించారు. ‘‘ దయచేసి కొంచెం విశ్రాంతి తీసుకోండి. మీ తల్లి మరణానికి ఎలా సంతాపం చెప్పాలో నాకు తెలియడం లేదు. మీ అమ్మ మా అమ్మ. నేను నా తల్లిని గుర్తుంచుకున్నాను’’ ఆమె ప్రధాని మోడీతో అన్నారు.

ఫోన్ నెంబర్లు ఇవ్వాలని మహిళలను వేధించిన తాగుబోతు.. దేహశుద్ధి చేసిన స్థానికులు.. కర్ణాటకలో ఘటన (వీడియో)

వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ వరుస ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఆ రాష్ట్రాన్ని శుక్రవారం సందర్శించాల్సి ఉంది. కానీ తల్లి మరణంతో ప్రధాని నరేంద్ర మోడీ గాంధీనగర్ నకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా ఆయన పర్యటను రద్దు చేసుకున్నా.. ఆ కార్యక్రమాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !