అలాంటి పునాదులపై ధృఢంగా నిలపడే సమాజాన్ని నిర్మించాం.. ప్రధాని మోదీ

By Ramya news teamFirst Published Jan 20, 2022, 3:08 PM IST
Highlights

సామాజిక రుగ్మతను పూర్తిగా నిర్మూలించి భారత్​ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వివక్షకు ఏ మాత్రం తావు లేని సమాజ నిర్మాణం జరుగుతోందని, భారత్​ ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తుందని ఉద్ఘాటించారు.

దేశంలో వివక్ష లేని వ్యవస్థను సృష్టించామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గురువారం ఆయన ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కి ఓర్ కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సామాజిక రుగ్మతను పూర్తిగా నిర్మూలించి భారత్​ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వివక్షకు ఏ మాత్రం తావు లేని సమాజ నిర్మాణం జరుగుతోందని, భారత్​ ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తుందని ఉద్ఘాటించారు.

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ సందర్భంగా.. ఏడాది పొడవునా బ్రహ్మకుమారీస్​ నిర్వహించే ఈ కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. 30కిపైగా క్యాంపెయిన్లు, 15 వేలకుపైగా వివిధ కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి.

 

Prime Minister Narendra Modi inaugurates the launch of 'Azadi Ke Amrit Mahotsav se Swarnim Bharat Ki Ore' pic.twitter.com/WF8L5RPEQx

— ANI (@ANI)

బ్రహ్మకుమారీస్​ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 7 కార్యక్రమాలను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఆ ఏడు కార్యక్రమాలు.. మై ఇండియా హెల్దీ ఇండియా, ఆత్మనిర్భర్​ భారత్​: సెల్ఫ్​ రిలయంట్​ ఫార్మర్స్​, విమెన్​: ఫ్లాగ్​ బేరర్స్​ ఆఫ్​ ఇండియా, పవర్​ ఆఫ్​ పీస్​ బస్​ క్యాంపెయిన్​, అందేఖా భారత్​ సైకిల్​ ర్యాలీ, యునైటెడ్​ ఇండియా మోటార్​ బైక్​ క్యాంపెయిన్​, స్వచ్ఛ భారత్​ అభియాన్​లో భాగంగా చేపట్టే గ్రీన్​ ఇనిషియేటివ్స్​.

click me!