కోవిడ్ వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కేశాడు..!

By Ramya news teamFirst Published Jan 20, 2022, 2:35 PM IST
Highlights

వ్యాక్సిన్ వేస్తుండగా.. ఓ వ్యక్తి వ్యాక్సిన్  కి భయపడి.. వెంటనే.. వెళ్లి చెట్టు ఎక్కాడు. దీనికి వైద్య సిబ్బంది వీడియో తీయగా.. అది కాస్త వైరల్ గా మారింది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి రమ్మంటే.. ఆయన చెట్టు ఎక్కడం గమనార్హం.
 

ఉత్తర ప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నాటికి.. రాష్ట్రంలోని ప్రజలు మొత్తం వ్యాక్సిన్ వేయించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో.. ఆరోగ్య అధికారుల బృందం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో.. యూపీలోని బల్లియా జిల్లాలో కూడా వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు.

అక్కడ.. వ్యాక్సిన్ వేస్తుండగా.. ఓ వ్యక్తి వ్యాక్సిన్  కి భయపడి.. వెంటనే.. వెళ్లి చెట్టు ఎక్కాడు. దీనికి వైద్య సిబ్బంది వీడియో తీయగా.. అది కాస్త వైరల్ గా మారింది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి రమ్మంటే.. ఆయన చెట్టు ఎక్కడం గమనార్హం.

అతనిని కిందకు రావాలని వైద్యాధికారులు ఎంత బతిమిలాడినా... అతను కిందకు దిగకపోవడం గమనార్హం.  తాను చేతులకు ఇంజెక్షన్ చేయించుకోనని.. కిందకు దిగను అని తేల్చి చెప్పడం గమనార్హం. చివరకు వాళ్లు బతిమిలాడటంతో.. అతను కిందకు దిగి వ్యాక్సిన్ వేయించుకోవడం గమనార్హం.

మరొక వీడియోలో, ఒక వ్యక్తి కోవిడ్ వ్యాక్సిన్ పొందకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆరోగ్య అధికారులతో కుస్తీ పడుతున్నట్లు కనిపించింది.. చాలా మందికి అధికారులు వ్యాక్సిన్ వేయించుకోమని బతిమిలాడటం గమనార్హం.

ఈ రెండు వీడియోలు.. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. గత ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఉత్తరప్రదేశ్ 24 కోట్ల డోస్‌లను అందించింది, ఇది మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు (HCWs) టీకాలు వేయబడింది. ఫ్రంట్‌లైన్ కార్మికుల (FLWs) టీకా ఫిబ్రవరి 2, 2021 నుండి ప్రారంభమైంది.
 

click me!