శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకం: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

By narsimha lode  |  First Published Jan 31, 2024, 10:39 AM IST


పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ  మీడియాతో మాట్లాడారు. 


న్యూఢిల్లీ:శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు  బుదవారం నుండి ప్రారంభం కానున్నాయి.పార్లమెంట్  సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకొని  ఇవాళ  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  మీడియాతో మాట్లాడారు.  బడ్జెట్ ను  నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతుండడం  నారీశక్తికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.జనవరి  26న కర్తవ్యపథ్ లో నారీశక్తి ఇనుమడించిందని ప్రధాని గుర్తు చేశారు.నారీశక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుందన్నారు.

ఇన్నాళ్లూ సమావేశాల్ని అడ్డుకున్నవారు.. తమ చర్యలను సమీక్ష చేసుకోవాలని మోడీ  సూచించారు.చివరి సమావేశాలు సజావుగా సాగాల్సిన అవసరం ఉందని మోడీ  నొక్కిచెప్పారు.పార్లమెంట్ లో చర్చలకు ప్రతిపక్షాలు సహకరించాలని  ప్రధాన మంత్రి సూచించారు.లోక్ సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతామని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో  గందరగోళం సృష్టించిన విషయాన్ని ఎవరూ కూడ గుర్తు పెట్టుకోరని మోడీ అభిప్రాయపడ్డారు.ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కే అలవాటున్న ఎంపీలు ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశిస్తున్నట్టుగా మోడీ చెప్పారు.

Latest Videos

ఇవాళ్టి నుండి  ఫిబ్రవరి  9వ తేదీ వరకు  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.  19 బిల్లులను కేంద్ర ప్రభుత్వం  పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనుంది.  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో  మోడీ సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది.పార్లమెంట్ ఎన్నికల తర్వాత  కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్ ఎన్నికలకు  ముందు జరుగుతున్న ఈ సమావేశాలే  చివరి సమావేశాలు. 
 

 

click me!