Delhi Police Commissioner: ఢిల్లీకి నయా పోలీస్‌ బాస్‌.. సంజయ్ అరోరా గురించి ఆసక్తికర విశేషాలు..

By Rajesh KFirst Published Jul 31, 2022, 2:42 PM IST
Highlights

Delhi Police Commissioner: ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ రాకేశ్ అస్థానా స్థానంలో కొత్త పోలీస్ కమిషనర్‌గా సంజయ్ అరోరా నియమితులయ్యారు.  పోలీస్ కమిషనర్‌ రాకేష్ అస్థానా  పదవీ కాలం నేటీతో ముగియ‌నునడంతో  ఆయన స్థానంలో కొత్త కమిషనర్‌గా సంజయ్ అరోరా నియమితులయ్యారు. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Delhi Police Commissioner: ఢిల్లీ నూత‌న‌ పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ సంజయ్ అరోరా(Sanjay Arora) నియమితులయ్యారు. ప్ర‌స్తుతం ఉన్న‌ కమిషనర్‌గా ఉన్న రాకేష్ అస్థానా  పదవీ కాలం నేటీతో ముగియ‌నునడంతో  ఆయన స్థానంలో కొత్త కమిషనర్‌గా సంజయ్ అరోరా నియమితులయ్యారు. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1988 బ్యాచ్ తమిళనాడు కేడర్ చెందిన‌ IPS సంజయ్ అరోరా ITBP డైరెక్టర్ జనరల్‌గా ప‌ని చేశారు. ఆయ‌న 1997 నుండి 2000 వరకు ఉత్తరాఖండ్‌లోని మట్లీలో ITBP బెటాలియన్‌కు నాయకత్వం వహించారు.

Sanjay Arora ప్రొఫైల్ 

IPS Sanjay Arora  జైపూర్ (రాజస్థాన్)లోని మాల్వియా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఐపీఎస్ అయ్యాక తమిళనాడు పోలీస్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన స్పెషల్ టాస్క్ ఫోర్స్‌లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా ఉన్నారు. వీరప్పన్ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా ఆయ‌న ఆప‌రేష‌న్లను నిర్వ‌హించి విజయాన్ని సాధించాడు. శౌర్యం,  సాహసోపేతమైన చర్యలకు ముఖ్యమంత్రి గ్యాలంట్రీ మెడల్‌ను కూడా అందుకున్నారు.

Sanjay Arora 1991లో NSG నుండి శిక్షణ తీసుకున్నారు. దీని తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి భద్రతలో నియమించబడిన ప్రత్యేక భద్రతా బృందం (SSG) ఏర్పాటులో ఆయ‌న ముఖ్యమైన పాత్ర పోషించాడు. నిజానికి.. ఆ రోజుల్లో LTTE కార్యకలాపాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అటువంటి పరిస్థితిలో ఆయ‌న  తమిళనాడులోని వివిధ జిల్లాల్లో పోలీసు సూపరింటెండెంట్‌గా కూడా బాధ్యతలు స్వీకరించాడు. 

పారామిలటరీ ఫోర్స్‌లో డిప్యుటేషన్‌పై కమాండెంట్‌గా వచ్చిన కొద్దిమంది ఐపీఎస్‌లలో సంజయ్ అరోరా ఒకరు. IPS సంజయ్ అరోరా 1997 నుండి 2002 వరకు కమాండెంట్‌గా డిప్యుటేషన్‌పై ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)లో పనిచేశారు. 1997 నుండి 2000 వరకు ఆయ‌న‌ ఉత్తరాఖండ్‌లోని మట్లీలో ITBP బెటాలియన్‌కు బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ కు నాయకత్వం వహించాడు. 

అనంత‌రం 2000 నుండి 2002 వరకు ఆయ‌న శిక్షకుడిగా  ITBP అకాడమీకి విశేషమైన సేవలను అందించారు. దీనితో పాటు ముస్సోరీలో కమాండెంట్ (కాంబాట్ వింగ్)గా పనిచేస్తున్నాడు. సంజయ్ అరోరా 2002 నుండి 2004 వరకు కోయంబత్తూర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత విల్లుపురం రేంజ్‌లోని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. సంజయ్ అరోరా IG (స్పెషల్ ఆపరేషన్స్) BSF, IG ఛత్తీస్‌గఢ్ సెక్టార్ CRPF,  IG ఆపరేషన్స్ CRPF గా సేవ‌లందించారు.

ఎన్నో పతకాలు, సత్కరాలు

2004లో Sanjay Arora ప్రతిభావంతమైన సేవకు పోలీసు పతకం, 2014లో విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీసు పతకం, పోలీస్ స్పెషల్ డ్యూటీ మెడల్, అంతర్గత భద్రతా పతకం, ఐక్యరాజ్యసమితి శాంతి పతకం వంటి ఎన్నో పతకాలు ఆయ‌న‌కు సేవాల‌కు ద‌క్కాయి. 
 
ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా రాకేష్ అస్థానా పదవీకాలం నేటితో ముగుస్తుంది. కాబట్టి ఆయ‌న‌ వీడ్కోలు పరేడ్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు పోలీసు లైన్‌లో వీడ్కోలు కార్యక్రమం ఉంటుంది. నిజానికి ఢిల్లీ పోలీస్ కమిషనర్ పదవీ విరమణ చేసినప్పుడల్లా వీడ్కోలు పరేడ్ నిర్వహిస్తారు.

click me!