సాక్షాత్తూ కేంద్రమంత్రి ఇంట్లో "మంచి"నీరు కరువు... ఇది ఢిల్లీ పరిస్థితి

By telugu teamFirst Published Feb 29, 2020, 1:48 PM IST
Highlights

బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్వహించిన ఒక పరిశీలనలో సాక్షాత్తు కేంద్ర మంత్రి ఇంట్లోనే మంచినీరు పరిశుభ్రంగా లేదని తేలడంతో ఒక్కసారిగా దేశం అవాక్కయింది. సాక్షాత్తు కేంద్ర మంత్రి ఇంటి పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటె... మామూలు వారి పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవాలంటూ సామాన్యులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 

నీటి కాలుష్యమనేది అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా తీవ్రంగా పరిగణిస్తారు. కానీ అదే మన భారత దేశంలో అదో సర్వ సాధారణ అంశంగా మనము చూస్తాము. మన దేశంలో నీరు శుభ్రంగా ఉందనేది మనకో వింత. 

అయితే సాధారణంగా ప్రముఖుల ఇల్లు మాత్రం దీనికి మినహాయింపుగా మనకు కనబడతాయి. తాజాగా న్యూ ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన విస్తుపోయే విషయాలను మనకు తెరమీదకు తీసుకొచ్చింది. 

Also read: ఇతర మెట్రో నగరాల కంటే మన హైదరాబాద్‌ బెస్ట్‌

బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్వహించిన ఒక పరిశీలనలో సాక్షాత్తు కేంద్ర మంత్రి ఇంట్లోనే మంచినీరు పరిశుభ్రంగా లేదని తేలడంతో ఒక్కసారిగా దేశం అవాక్కయింది. సాక్షాత్తు కేంద్ర మంత్రి ఇంటి పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటె... మామూలు వారి పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవాలంటూ సామాన్యులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే... ఢిల్లీ వ్యాప్తంగా 11 చోట్ల నీటి నమూనాలను సేకరించిన బి ఐ ఎస్ వాటిని పరిశీలించింది. ఈ 11 సాంపిల్స్ లో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఇల్లు కూడా ఉంది.

ఈ అన్ని నమూనాలో కూడా కొలీఫామ్, అల్యూమినియం స్థాయిలు... ఉండవలిసిన స్థాయికన్నా ఎక్కువగా ఉన్నాయని అవి ప్రమాదకారులుగా పరిణమించే వాటిగా ఉన్నాయని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 

Also read: DELHI AIR POLLUTION: ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ కాలుష్యం: రంగంలోకి పీఎంవో

గతంలో ఢిల్లీతోపాటు ప్రధాన నగరాల్లో నీటి కాలుష్యం ఏ స్థాయిలో ఉందొ పరీక్షించాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో బి ఐ ఎస్ ఇలా నీటి నమూనాలను సేకరించి పరీక్షలు చేసింది. ఈ రెపోరేటునే సుప్రీమ్ కోర్టుకి సమర్పించింది. 

click me!