రాజద్రోహం కేసు: పోయేదేమీలేదన్న కన్నయ్య కుమార్

By telugu teamFirst Published Feb 29, 2020, 12:54 PM IST
Highlights

ఎన్నికల్లో పోటీ చేయబోతున్నప్పుడు మొదటిసారి చార్జిషీట్ దాఖలైందని, ఇప్పుడు మళ్ళీ బీహార్లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో మరోసారి దానిపై విచారణ చేపడుతున్నారని కన్నయ్య ఆరోపించారు. 

2016 నాటి జెఎన్‌యు దేశద్రోహ కేసులో విచారణ జరిపేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. ఇలా ఢిల్లీ ప్రభుత్వం అనుమతించిన సమయాన్ని సందర్భాన్ని జెఎన్‌యుఎస్‌యు మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ప్రశ్నించారు. 

ఈ విషయంపై స్పందిస్తూ వేగవంతమైన విచారణను ఈ వామపక్ష నాయకుడు డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాల నాటి దేశద్రోహ కేసును ఇప్పుడు అదును చూసుకొని రాజకీయ లబ్ది కోసం ఇలా  దేశద్రోహం వంటి చట్టం ఎలా దుర్వినియోగం అవుతుందో దేశం మొత్తం చూస్తుందని అని ఆయన అన్నాడు. 

సిపిఐ అభ్యర్థిగా బెగుసరాయ్ సీటు నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి బిజెపికి చెందిన గిరిరాజ్ సింగ్ చేతిలో ఓడిపోయిన కన్హయ్య, బీహార్‌లో ఎన్నికల్లో పోటీ చేయబోతున్న సమయంలో తనపై ఉద్దేశపూర్వకంగా చార్జిషీట్ దాఖలు చేశారని ఆరోపించారు. 

తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నప్పుడు మొదటిసారి చార్జిషీట్ దాఖలైందని, ఇప్పుడు మళ్ళీ బీహార్లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో మరోసారి దానిపై విచారణ చేపడుతున్నారని కన్నయ్య ఆరోపించారు. 

ఈ విషయం రాజకీయ ప్రయోజనం కోసం సృష్టించబడిందని, కావాలని నాలుగు సంవత్సరాలుగా కోల్డ్ స్టోరేజ్ లో ఉంచి ఆలస్యం చేసిన విషయం స్పష్టంగా తెలుస్తుందని కన్నయ్య అభిప్రాయపడ్డాడు.  

ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగవంతమైన విచారణను తాను కోరుకుంటున్నానని, తద్వారా దేశద్రోహం వంటి చట్టం ఎలా దుర్వినియోగం అవుతుందో దేశం మొత్తం తెలుసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసాడు. 

ఈ కేసులో కన్నయ్యతోపాటు మరో ఇద్దరిని విచారించాలని ఢిల్లీ ప్రభుత్వం నగర పోలీసులకు శుక్రవారం అనుమతి ఇచ్చిన తరువాత కన్నయ్య కుమార్ ఇలా స్పందించాడు. ఈ కేసులో కన్నయ్య కుమార్‌పై విచారణ జరిపేందుకు త్వరితగతిన క్లియరెన్స్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు ఢిల్లీ హోం కార్యదర్శికి బుధవారం లేఖ రాసైనా విషయం తెలిసిందే. 

click me!