పాటతో అదరగొట్టిన సీఎం కేజ్రీవాల్.. వీడియో వైరల్

By telugu news teamFirst Published Feb 17, 2020, 8:04 AM IST
Highlights

1960లలో యూఎస్ లో పౌర హక్కుల ఉద్యమం సమయంలో (వి షాల్‌ ఓవర్‌కమ్‌) పాట ఎంతో ప్రాచుర్యం పొంది.. వారి ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఇదే పాటను హిందీ కవి గిరిజా కుమార్ మాథుర్ 'హమ్ హోంగే కామ్ యాబ్' పేరుతో హిందీలోకి అనువాదం చేశారు.
 

దేశ రాజధాని ఢిల్లీ సీఎం గా అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ధన్యవాద్ ఢిల్లీ పేరుతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం చివర్లో కేజ్రీవాల్ ఓ పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారరు.

'నేను ఇప్సుడు ఒక పాట పాడతాను. కానీ ఒక కండీషన్‌.. అదేంటంటే.. నేను పాట పాడితే నాతోపాటు మీరు కూడా పాడాలి. మనందరి సమిష్టి కలను నెరవేర్చుకునేందుకు ఈ ప్రార్థన చాలా అవసరం' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా  'హమ్ హోంగే కామ్ యాబ్'(వి షాల్‌ ఓవర్‌కమ్‌) పాటను పాడి.. అందరితో పాడించారు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

Also Read కేజ్రీవాల్ 3.0: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణం...

1960లలో యూఎస్ లో పౌర హక్కుల ఉద్యమం సమయంలో (వి షాల్‌ ఓవర్‌కమ్‌) పాట ఎంతో ప్రాచుర్యం పొంది.. వారి ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఇదే పాటను హిందీ కవి గిరిజా కుమార్ మాథుర్ 'హమ్ హోంగే కామ్ యాబ్' పేరుతో హిందీలోకి అనువాదం చేశారు.

Delhi Chief Minister Arvind Kejriwal sings 'Hum honge kaamyaab', at his swearing-in ceremony pic.twitter.com/hwXi8FUW46

— ANI (@ANI)

 

ఇంతకుముందు కూడా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార ముగింపు సమయంలో కేజ్రీవాల్‌ ఇలాగే హిందీ చిత్రం 'పైగాం'లోని 'ఇన్సాన్ కా హో ఇన్సాన్ సే భైచారా' అనే దేశభక్తి గీతం ఆయన ఆలపించడం విశేషం. కాగా... ఈ సంగతి పక్కన పెడితే.. కేజ్రీవాల్ తో పాటు మరో ఆరుగురు ఆప్ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. 

వారిలో మనీష్‌ సిసోడియా, కైలేష్‌ గెహ్లాట్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌, సత్యేంద్ర జైన్‌, గోపాల్‌ రాయ్‌, రాజేంద్ర పాల్‌ గౌతమ్‌లు ఉన్నారు. ఢిల్లీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 62 గెలవగా, బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది.

click me!