కూతురి పెళ్లికి ప్రధానిని ఆహ్వానించిన రిక్షావాలా, స్పందించిన మోడీ

By Siva KodatiFirst Published Feb 16, 2020, 8:29 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసికి సమీపంలోని దొమ్రి గ్రామానికి చెందిన మంగళ్ కేవాత్. రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జీవితాంతం రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో తన కూతురికి వివాహం చేయడానికి నిర్ణయించాడు

రెక్కాడితే కానీ డొక్కాడని ఓ రిక్షావాలా ప్రధాని నరేంద్రమోడీ పట్ల తనకున్ని అభిమానాన్ని చూపించాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసికి సమీపంలోని దొమ్రి గ్రామానికి చెందిన మంగళ్ కేవాత్ రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

జీవితాంతం రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో తన కూతురికి వివాహం చేయడానికి నిర్ణయించాడు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటూనే, బంధువులు, మిత్రులను పెళ్లికి ఆహ్వానించాడు.

Also Read:3 గంటలు... 100 కోట్లు @ ట్రంప్ పర్యటన ఖర్చు ఇది

అదే సమయంలో తన కుమార్తె పెళ్లికి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించాడు. ఫిబ్రవరి 12న జరగనున్న తన బిడ్డ పెళ్లికి వచ్చి ఆమెను ఆశీర్వాదించాలంటూ ఓ లేఖ కూడా రాశాడు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోడీ కేవత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ మరో లేఖ రాశారు.

జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలంటూ కేవత్ కుమార్తెను ఆశీర్వదించారు. తన అభిమాన నేత మోడీ నుంచి లేఖ రావడంతో కేవత్ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపపోతున్నాడు.

Also Read:ప్రశాంత్ కిశోర్ ఎఫెక్ట్: అందుకే వైఎస్ జగన్ తో మోడీ, అమిత్ షాల భేటీ

తన కుమార్తె పెళ్లికి రావాల్సిందిగా ఒకటి ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి, రెండోది వారణాసిలోని ఆయన క్యాంపు కార్యాలయానికి రెండు శుభలేఖలు పంపినట్లు కేవత్ తెలిపాడు. తనకు ఆయన నుంచి ప్రత్యుత్తరం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు.

మోడీ నుంచి వచ్చిన లేఖను బంధు మిత్రులందరికీ చూపించిన కేవత్.. ఆ లేఖను జీవితాంతం దాచుకుంటానని చెప్పాడు. కాగా కేవత్‌కు గంగానది అంటే ప్రాణం. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో యాక్టివ్‌గా పాల్గొనే అతను.. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏకంగా ప్రధాని మోడీతో నమోదు చేయించుకోవడం విశేషం.

click me!