బోర్ వెల్ లో పడిన రోహిత్: ఆరు గంటల శ్రమతో బయటకు....

By telugu teamFirst Published Feb 16, 2020, 9:21 PM IST
Highlights

రోహిత్ ఖార్వీ అనే కూలీ 15 అడుగుల లోతులో పడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో జరిగింది. ఆరు గంటల పాటు శ్రమించి రోహిత్ ను సహాయ బృందాలు వెలికి తీశాయి. 

ఉడిపి: బోర్ వెల్ లో పడిన ఓ వ్యక్తిని ఆరు గంటల పాటు శ్రమించి వెలికి తీశారు. ఈ సంఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో జరిగింది. రోహిత్ ఖార్వీ అనే కూలీ 15 అడుగుల లోతు గల బోర్ వెల్ లో పడ్డాడు. బోర్ వెల్ చుట్టుపక్కల భూమిని తవ్వడంతో ప్రమాదవశాత్తు అతను అందులో పడ్డాడు.

కర్ణాటకలోని ఉడిపి జిల్లా బైందూర్ తాలూకాలో గల మారావంతే గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ బ్రిగేడ్, పోలీసులు ఆరు గంటల పాటు శ్రమించి అతన్ని సురక్షితంగా వెలికి తీశారు.

బోర్ వెల్ అన్ లోడింగ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న సమయంలో రోహిత్ 15 అడుగుల లోతులోకి జారిపడ్డాడు. మట్టిలో కూరుకుపోయాడు. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని రోహిత్ కు ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేశారు.  అతని తలపై మట్టి పడకపోవడం అతన్ని కాపాడింది. 

బోర్ వెల్ పక్కన జెసీబీ ద్వారా మరో గుంత తవ్వారు. ఆరు గంటల శ్రమించి అతన్ని సురక్షితంగా వెలికి తీశారు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉంది.

 

Karnataka: Rohith, the man who had fallen into a 15-feet deep hole in Udupi district has been rescued. https://t.co/yz42yjlMsD pic.twitter.com/hN0dlA94dV

— ANI (@ANI)
click me!