నా బట్టలు నేనే ఉతుక్కొంటున్నా: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

Published : Jul 28, 2020, 02:55 PM IST
నా బట్టలు నేనే ఉతుక్కొంటున్నా: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

సారాంశం

తన బట్టలను తానే ఉతుక్కొంటున్నానని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.  


భోపాల్: తన బట్టలను తానే ఉతుక్కొంటున్నానని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

కరోనా సోకిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భోపాల్ లోని చిరాయు ఆసుపత్రిలో శివరాజ్ సింగ్ చౌహాన్ చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 25వ తేదీన కరోనా సోకిందని తేలడంతో ఆయన ఆసుపత్రిలో చేరాడు.

ఇవాళ మరో వీడియోను శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియోను విడుదల చేశారు. తనకు కరోనా సోకినందున తన బట్టలను శుభ్రపర్చేందుకు ఇతరులకు ఇవ్వడం లేదన్నారు. తన బట్టలను తాను శుభ్రపర్చుకోవడం వల్ల తాను ప్రయోజనం పొందినట్టుగా ఆయన చెప్పారు.

తన చేతికి గతంలో సర్జరీ అయిందని ఆయన గుర్తు చేసుకొన్నారు. తన బట్టలను తాను శుభ్రపర్చుకోవడం వల్ల తన చేయి గతంలో కంటే మెరుగ్గా తిప్పగలుగుతున్నట్టుగా ఆయన చెప్పారు. ఫిజియోథెరపిస్టులతో గతంలో పలుమార్లు చికిత్స చేసినా కూడ ఈ రకమైన ఫలితం లేదని ఆయన చెప్పారు.

తన చేతులతో చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటానని ఆయన చెప్పారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆయన మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

తాను ఆరోగ్యంగా ఉన్నట్టుగా చౌహాన్ ఆదివారం నాడు విడుదల చేసిన వీడియోలో ప్రకటించిన విషయం తెలిసిందే.సీఎం సతీమణి సాధన సింగ్, కొడుకులు కార్తికేయ, కునాల్ లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తే వారికి నెగిటివ్ వచ్చింది. సీఎంకు మాత్రమే కరోనా సోకింది.

కరోనా నెగిటివ్ వచ్చినప్పటికి కూడ ఈ ముగ్గురిని హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.మధ్యప్రదేశ్ లో 28,589 కరోనా కేసులు  నమోదయ్యాయి. ఇప్పటివరకు 820  మంది మరణించారు. 


 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం