కేరళ గోల్డ్ స్కాం: కస్టమ్స్ కస్టడీకి స్వప్న సురేష్, సందీప్ నాయర్‌

By narsimha lodeFirst Published Jul 28, 2020, 1:15 PM IST
Highlights

కేరళ గోల్డ్ స్కామ్ నిందితులుగా ఉన్న స్వప్న సురేష్, సందీప్ నాయర్ లను ఈడీ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం.

రళ గోల్డ్ స్కామ్ నిందితులుగా ఉన్న స్వప్న సురేష్, సందీప్ నాయర్ లను ఈడీ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం.యూఏఈ నుండి అక్రమంగా బంగారాన్ని తరలించారనే ఆరోపణలపై స్పవ్న సురేష్, సందీప్ నాయర్ లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే వీరిని తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కొచ్చిలోని ఆర్ధిక నేరాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈడీ అభ్యర్ధన మేరకు స్వప్న సురేష్, సందీప్ నాయర్ లను ఆగష్టు 1వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

మరో వైపు ఇదే కేసులో ఫైసల్ ఫరీద్, రాబిన్స్ హమీద్‌లపై కోర్టు నాన్ బెయిలబుల్  వారంట్ జారీ చేసింది.వీరిద్దరూ కూడ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. 

కేరళ గోల్డ్ స్కామ్ కు సంబంధించిన నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను అడిషనల్ చీప్ జ్యూడిషీయల్ మేజిస్ట్రేట్ తిరస్కరించారు. ఈ కేసులో హంజాద్ అలీ, సంజు, మహమ్మద్ అన్వర్, జిస్పల్, మహ్మద్ అబ్దుల్  షహీమ్ లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును ఎన్ఐఏ విచారణ చేస్తోంది.

30 కిలోల బంగారాన్ని యూఏఈ నుండి స్మగ్లింగ్ చేసినట్టుగా ఎన్ఐఏ గుర్తించారు. దీని విలువ రూ. 14.82 కోట్ల విలువ ఉంటుంది. కస్టమ్స్ అధికారులు తిరువనంతపురంలో ఈ బంగారం స్మగ్లింగ్ ను బట్టబయలు చేశారు.
 

click me!